రాహుల్ ద్రావిడ్ ఈ పేరు తెలియని వారుండరు. కెప్టెన్ గా మరియు ఆటగాడిగా టీమిండియాకు రాహుల్ ద్రావిడ్ ఎన్నో విజయాలు అందించారు. అంతేకాదు మిస్టర్ డిపెన్ డబుల్ అనే పేరు కూడా తెచ్చుకున్నారు. రాహుల్ ద్రావిడ్. క్రికెట్ నుంచి రిటైర్ అయిన అనంతరం కూడా అండర్ 19 కు కోచ్ గా వ్యవహరించారు ద్రావిడ్. ఇక ఇప్పుడు టీమిండియా కోచ్ గా ఎంపికయ్యారు. ఇంతటి గొప్ప మైలు రాయిని అందుకున్న రాహుల్ ద్రావిడ్ కు ప్రవీణ్ తాంబే అనే ఆటగాడు స్ఫూర్తి అట.
ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ ద్రావిడే ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. ” ప్రవీణ్ తాంబే… దాదాపు 20 ఏళ్ల పాటు కౌంటీ క్రికెట్ మరియు దేశవాలీ క్రికెట్ ఆడాడు. కానీ టీమిండియాలో జట్టు దక్కించుకోలేకపోయారు. అయినప్పటికీ బాధపడకుండా… ఎంతో పట్టుదలతో ఆడి… 41 ఏళ్లలో ఏపీఎల్ జట్టు లో స్థానం దక్కించుకున్నాడు. అలాంటి ప్రవీణ్ తాంబే ను యంగ్ క్రికెటర్లు ఆదర్శంగా తీసుకోవాలి. కష్ట పడ్డ వారికి కచ్చితంగా ఫలితం ఉంటుంది.” అంటూ చెప్పుకొచ్చారు రాహుల్ ద్రావిడ్. అలాగే ప్రతి ఒక్క ఆటగాడు ముందకు సాగాలని కోరారు.