తన ఫ్యాక్సిన్‌కి షాకింగ్ న్యూస్ చెప్పారు రఫెల్ నాదల్.. ఈ ఏడాది జరిగే వింబుల్డన్ ఓపెన్‌తో పాటు టోక్యో ఒలింపిక్స్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు ఈ టెన్నిస్ స్టార్… ఆటలో సుదీర్ఘకాలం కొనసాగాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు నాదల్.. అయితే, ఇది అంత సులవుగా తీసుకున్న నిర్ణయం కాదని, తన శారీరక పరిస్థితి బట్టి, తన టీమ్ సభ్యులతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.. 20 సార్లు గ్రాండ్‌స్లామ్ లను సాధించిన ఈ స్టార్ ప్లేయర్.. టోక్యో గేమ్స్, వింబుల్డన్ 2021 నుంచి వైదొలగబోతున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది..