స్పెయిన్ బుల్, టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కెరీర్ ముగిసింది. డేవిస్ కప్ 2024లో నెదర్లాండ్స్ చేతిలో స్పెయిన్ 2-1 తేడాతో ఓటమిపాలవ్వడంతో రఫా తన కెరీర్‌ను ముగించాడు. ముందుగా సింగిల్స్‌లో ఓడగా.. ఇప్పుడు నెదర్లాండ్స్ జట్టు ఓడిపోవడంతో నాదల్‌కు ఆడే ఛాన్స్ దొరకలేదు. డేవిస్ కప్‌తో ఆటకు వీడ్కోలు పలుకుతానని గత అక్టోబర్‌లోనే రఫా ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు దశాబ్దాలకు పైగా టెన్నిస్‌లో అద్వితీయ విజయాలు సాధించిన నాదల్.. తన పేరిట ఎన్నో రికార్డులు…
స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌తో పోటీ కారణంగానే తాను ఆటను మరింత ఆస్వాదించానని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తెలిపారు. రఫాది గొప్ప ప్రయాణం అని, 14 ఫ్రెంచ్ ఓపెన్‌లు గెలవడం చరిత్రాత్మకం అని ప్రసశంసించారు. స్పెయిన్ సహా మొత్తం టెన్నిస్ ప్రపంచం గర్వపడేలా చేశావని ఫెదరర్ పేర్కొన్నారు. డేవిస్‌కప్ తన కెరీర్‌లో చివరి టోర్నీ ప్రకటించిన నాదల్.. మంగళవారం తీవ్ర భావోద్వేగాల మధ్య బరిలోకి దిగాడు. క్వార్టర్ ఫైనల్స్ ఆరంభానికి కొన్ని గంటల ముందు ఫెదరర్…
MS Dhoni About Rafael Nadal: స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ ప్రొఫెషనల్ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పేశాడు. నవంబర్‌లో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్స్ తనకు చివరిదని వెల్లడించాడు. 2004లో కెరీర్ మొదలుపెట్టిన నాదల్.. ఆ రోజుల్లో ఆండీ రాడిక్, లీటన్ హెవిట్, రోజర్ ఫెదరర్ వంటి దిగ్గజాల మధ్య సంచలన ఆటతో దూసుకొచ్చాడు. మట్టికోట మహారాజుగా పేరుగాంచిన నాదల్.. 20 ఏళ్ల కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్స్ గెలిచాడు. స్పెయిన్ బుల్ టెన్నిస్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక…
స్పెయిన్ స్టార్ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ గురువారం టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సుదీర్ఘ కెరీర్‌కు స్పెయిన్ బుల్ గుడ్ బై చెప్పాడు. గాయాలతో వేగలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నాదల్ ప్రకటించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో నాదల్ 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించాడు. అందులో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. రోజర్ ఫెదరర్, ఆండీ రాడిక్, లీటన్ హెవిట్.. వంటి దిగ్గజాలు టెన్నిస్‌ను ఏలుతున్న రోజుల్లో నాదల్ అరంగేట్రం చేసి సత్తా చూపించాడు.
Rafael Nadal withdrawal from Australian Open 2024: స్పెయిన్ బుల్, దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాదల్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా తాను ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు 37 ఏళ్ల నాదల్ ఆదివారం ప్రకటించాడు. చికిత్స, విశ్రాంతి కోసం స్పెయిన్‌కు వెళ్లానున్నాడు. ఇక నాదల్ తప్పుకోవడంతో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్‌కు టైటిల్ గెలిచే అవకాశాలు మెరుగయ్యాయి. అయితే కార్లోస్ అల్కరాజ్, డేనియల్ మెద్వెదేవ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ మరియు…
దీర్ఘకాలిక తుంటిగాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలగుతున్నట్లు రాఫెల్ నాదల్ గురువారం ప్రకటించారు. కెరీర్‌కు సంబంధించి స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ సంచలన ప్రకటన చేశాడు. 2024 తన కెరీర్‌లో చివరి సీజన్ అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. అంతేగాక గాయాలు వెంటాడుతుండడంతో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగడం లేదన్నాడు.
Hardik Pandya : టీం ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుని ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ గా గుర్తింపు పొందాడు.
Novok Djokovic : సెర్బియన్ దిగ్గజ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్-2023 టైటిల్ విజేతగా నిలిచాడు. జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకోవడం ఇది పదోసారి.
ఫ్రెంచ్ ఓపెన్‌లో స్పెయిన్ ఆటగాడు రాఫెల్ నాదల్ మరోసారి తన సత్తా చాటాడు. ఆదివారం నాడు ఏకపక్షంగా సాగిల్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్‌ను 6-3, 6-3, 6-0 స్కోరు తేడాతో నాదల్ సులభంగా ఓడించాడు. తొలి రెండు సెట్లలో ఓ మోస్తరు ప్రతిఘటన కనబర్చిన రూడ్ చివరి సెట్‌లో మాత్రం నాదల్ దూకుడుకు తలవంచాడు. దీంతో రికార్డు స్థాయిలో 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నాదల్ కైవసం చేసుకున్నాడు. ఓవరాల్‌గా…
రాఫెల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు. 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ అడుగు దూరంలో నిలిచాడు. మరొక్క మ్యాచ్ గెలిస్తే చాలు ఓపెన్ టెన్నిస్ చరిత్రను తిరగరాస్తాడు. 35 ఏళ్ల స్పెయిన్ బుల్ శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో 7వ ర్యాంకు ఆటగాడు మాటియో బెర్రెటిన్‌ను 6-3, 6-2, 3-6, 6-3తో ఓడించి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. ఈ విజయంతో నాదల్ తన కెరీర్‌లో 29వ సారి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఆదివారం జరిగే…