హర్యానాలోని గురుగ్రామ్‌లో హత్యకు గురైన టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ (25) కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కన్న తండ్రి దీపక్ యాదవ్ తుపాకీతో కాల్చి చంపేశాడు. పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు రాధిక తల్లిని ప్రశ్నించేందుకు వెళ్తే షాకింగ్ సమాధానం చెప్పింది. తనకు జ్వరం వచ్చిందని.. విశ్రాంతి తీసుకుంటున్నట్లు పేర్కొంది. సంఘటన జరిగిన సమయం నుంచే తనకు అనారోగ్యం ఉందని తల్లి మంజు యాదవ్ చెప్పుకొచ్చింది. పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించింది. అయినా కూడా పోలీసులు పదే పదే ఆమెను ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. అయినా కూడా నోరు విప్పేందుకు ఏ మాత్రం ఇష్టపడలేదని సమాచారం. దీపక్ ఎందుకు చంపాడో తనకు తెలియదని చివరికి ఒకే ఒక మాటతో తేల్చి చెప్పింది.
ఇది కూడా చదవండి: Raja Saab : తమన్ సాంగ్స్ ప్రభాస్ కు నచ్చలేదా.. అందుకే దగ్గరుండి మరి.?
వాస్తవానికి రాధిక హత్య సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. సమీపంలో ఉన్న మామ కుల్దీప్ యాదవ్ బుల్లెట్ శబ్దాలు విని పరుగెత్తికొచ్చాడు. విగతజీవిగా పడి ఉన్న రాధికను ఆస్పత్రికి తీసుకెళ్లాడు.. కానీ ప్రయోజనం లేదు. అయితే ఈ హత్యకు రాధిక.. ఒక యువకుడితో తీసిన వీడియోనే కారణంగా తెలుస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఇంట్లో పరువు పోయిందని భావించింది. దీంతో అప్పట్నుంచే గొడవలు జరుగుతున్నాయి. ఈ మధ్య రీల్స్ ఎక్కువ్వడం… ఆదాయం పెరగడంతో రాధికకు లెక్కలేనితనం వచ్చేసింది. బంధువులు కూడా కుమార్తె కష్టం మీద జీవిస్తున్నారంటూ హేళన మాటలు కూడా దీపక్‌కు కోపాన్ని తెప్పించాయి. ఈ నేపథ్యంలోనే కన్న కూతురిని చంపేశాడు.
ఇది కూడా చదవండి: Asia Cup 2025: ఆసియా కప్ నిర్వహణపై అనిశ్చితి… ఢాకా మీటింగ్‌కు భారత్, శ్రీలంక దూరం!
రాధిక యాదవ్ రాష్ట్ర స్థాయిలో ప్రసిద్ధ టెన్నిస్ క్రీడాకారిణి. పలు టోర్నమెంట్స్‌లో మెడల్స్ సాధించి కుటుంబానికి, ఆ ప్రాంతానికి కీర్తిని తెచ్చిపెట్టింది. అయితే గురువారం ఉదయం వంట గదిలో రాధిక అల్పాహారం సిద్ధం చేస్తుండగా వెనుక నుంచి లైసెన్స్ తుపాకీతో తండ్రి దీపక్ యాదవ్ ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. మూడు బుల్లెట్లు లోపలికి దూసుకెళ్లడంతో ప్రాణాలు వదిలింది.