ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్థేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఖరి బంతికి 3 పరుగులు కావాల్సి ఉండగా సికిందర్ రజా మూడు పరుగులు తీయడంతో పంజాబ్ కింగ్స్ విజయం సొంతమైంది.
Also Read : Viral Video : ఫన్నీ రోడ్ యాక్సిడెంట్.. వైరల్ అవుతున్న వీడియో..!
పంజాబ్ భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ కు లియామ్ లివింగ్ స్టోన్ ( 24 బంతుల్లో 40: 1 ఫోర్, 3 సిక్సర్లు). ప్రభు సిమ్రన్ సింగ్ ( 24 బంతుల్లో 42: 4 ఫోర్లు, 2 సిక్సర్లు ), పాటు జితేశ్ శర్మ ( 10బంతుల్లో 21, 2 ఫోర్లు, 1 సిక్స్ ), సికందర్ రజా ( 7 బంతుల్లో 13 నాటౌట్, 1 ఫోర్ ), వీరోచితంగా పోరాడి విజయాన్ని అందించారు. ఈ విజయంతో పంజాబ్ ఆర్సీబీని వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది.
Also Read : Akhil Akkineni: అఖిల్ కు ఆ దోషం ఉంది.. ఆమె మాట వింటే..వేణుస్వామి సంచలన కామెంట్స్
201 లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలో ధాటిగానే పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ ( 15 బంతుల్లో28, 4 ఫోర్లు, సిక్స్ ), ప్రభు సిమ్రన్ సింగ్ ( 24 బంతుల్లో 42: 4 ఫోర్లు, 2 సిక్సర్లు ) తొలి వికెట్ కు 4.2 ఓవర్లలోనే 50 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇక పంజాబ్ విజయానికి చివరి 3 ఓవర్లలో 31 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. పతిరణ వేసిన 18వ ఓవర్లో ఫస్ట బాల్ కు సామ్ కర్రన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ ఓవర్ లో 9 పరుగులొచ్చాయి. తుషార్ వేసిన 19వ ఓవర్ లో నాలుగో బాల్ కు సామ్ కర్రన్ ఔట్ అయ్యాడు.
Also Read : Weather Update: రాబోయే రెండురోజులు.. ఏపీలో పిడుగులతో కూడిన భారీవర్షాలు
ఇక 19వ ఓవర్ లో 13 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్ లో 9 పరుగుల కావాల్సి వచ్చింది. పతిరాణ వేసిన ఈ ఓవర్లో ఫస్ట బాల్ కు సింగిల్ వచ్చింది. రెండో బాల్ కు సింగిల్ వచ్చింది. మూడో బాల్ డాట్ అయ్యింది. నాలుగో బాల్ కు రెండు పరుగులొచ్చాయి. ఐదో బాల్ కు మరో రెండు పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి రజా బ్యాక్ వర్డ్ స్వ్కేర్ లెగ్ దిశగా ఆడి మూడు పరుగులు తీయడంతో పంజాబ్ కు థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు.
Also Read : ఇండియాలో మోస్ట్ బ్యూటిఫుల్ రైల్వేస్టేషన్లు ఇవే..
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్న ఓపెనర్లు శుభారంభమే అందించారు. సీఎస్కే ఓపెనర్ డేవాన్ కాన్వే ( 52బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్ తో 92 పరుగులు చేసి నాటౌట్ )కు తోడుగా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ( 31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్ తో 37 పరుగులు ), రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ధోనీ ఆఖరి ఓవర్ లో వచ్చి రెండు భారీ సిక్సర్లు కొట్టడంతో 200 పరుగుల మార్క్ దాటింది.