ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్థేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది.