Australia Cricket: మాకు విరాట్ కోహ్లీ లాంటి బ్యాటర్ లేడు.. కమిన్స్ సంచలన వ్యాఖ్యలు!
- శ్రీలంక, జింబాబ్వేపై దారుణ ఓటమి
- టీ20 ప్రపంచకప్ 2026 నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమణ
- ఆసీస్ నిష్క్రమణపై కమిన్స్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pat Cummins About Australia Elimination in T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 నుంచి మాజీ ఛాంపియన్, క్రికెట్‌ను కొన్నేళ్ల పాటు శాసించిన ఆస్ట్రేలియా నిష్కమించింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్.. ఎవరూ ఊహించని రీతిలో మెగా టోర్నీ నుంచి ఇంటిదారి పట్టింది. చివరి మ్యాచ్‌లో ఒమన్‌పై గెలిచినా ఆస్ట్రేలియాకు పెద్దగా ఉపయోగం లేదు. పసికూన ఐర్లాండ్‌పై గెలిచిన ఆసీస్.. శ్రీలంక, జింబాబ్వేపై దారుణంగా ఓడింది. ముఖ్యంగా పసికూన జింబాబ్వేపై ఓటమితో ఆస్ట్రేలియాపై విమర్శలు ఎక్కువయ్యాయి. టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్ వైఫల్యంపై ఆ దేశ మాజీలు, క్రికెటర్లు కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన నేపథ్యంలో కెప్టెన్ పాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టోర్నీలో మంచి ఆరంభాలు లేకపోవడమే ప్రధాన లోపమని స్పష్టం చేశాడు. ‘పాట్.. ఆస్ట్రేలియాకు ఇది గొప్ప టోర్నమెంట్ కాదు. కానీ జింబాబ్వే మ్యాచ్‌ను ఛేదించవచ్చని మీరు అనుకుంటున్నారా?’ అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.. ‘నిజాయితీగా చెప్పాలంటే.. టీ20 క్రికెట్లో ఓపెనింగే మ్యాచ్ విజయంను శాసిస్తుంది. ఓపెనర్లు రాణిస్తే మ్యాచ్ దాదాపు పూర్తవుతుంది. మా ఓపెనర్లు ఈ టోర్నమెంట్లో రాణించలేదు. బలమైన ఆరంభ భాగస్వామ్యం లేకపోవడమే మా కూటములకు కారణం’ అని కమిన్స్ బదులిచ్చాడు.
Also Read
- IPL 2027: రిషభ్ పంత్ రాక.. కేఎల్ రాహుల్ భవిష్యత్తుపై చర్చ!
- Faf du Plessis: 41 ఏళ్ల వయసులోనూ డు ప్లెసిస్ విధ్వంసం.. ప్రపచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డ్..
- Sreesanth: ‘గంభీర్ నన్ను దేశద్రోహి, F** అంటూ బూతులు తిట్టాడు’.. టీమిండియా మాజీ పేసర్ ఆవేదన..
- Gautham Gambhir: ఆ విజయాలతో గంభీర్ కి ఏం సంబంధం లేదు.. నిప్పు రాజేసిన శ్రీశాంత్ కామెంట్స్
Also Read: Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం!
జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుతూ… ‘జింబాబ్వే మ్యాచ్‌లో త్వరగా వికెట్లు కోల్పోవడం వల్ల ఒత్తిడి పెరిగింది. పవర్ ప్లేలోనే కీలక వికెట్స్ పడ్డాయి. ఒక దశలో మాకు 18 బంతుల్లో 48 పరుగులు అవసరం. ఆ లక్ష్యాన్ని సాధించడం సాధారణ బ్యాటర్‌కు సాధ్యం కాదు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ తప్ప ఏ బ్యాట్స్‌మన్ కూడా సాధించలేడు. మాకు కోహ్లీ లాంటి బ్యాటర్ లేడు’ అని పాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు. 2022 అక్టోబర్ 22న పాకిస్థాన్‌పై కోహ్లీ ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌ను కమిన్స్ గుర్తుచేశాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ ప్రదర్శన క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేనిదని, అలాంటి ఆటను మరో ఆటగాడు పునరావృతం చేయడం చాలా కష్టం అని అభిప్రాయపడ్డాడు. వెన్ను గాయం కారణంగా కమిన్స్ టీ20 వరల్డ్‌కప్ 2026కు దూరమైన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Rukmini Vasanth : AIతో మార్ఫింగ్ వీడియోలు.. నటి రుక్మిణి వసంత్ పేరుతో అసభ్యకర ప్రచారం.. ముగ్గురి అరెస్ట్
-
Tata Sierra EV: టాటా సియెర్రా EV టీజర్ విడుదల.. ఫస్ట్ లుక్ అదిరింది.. భారీ బ్యాటరీ, ప్రీమియం ఫీచర్లతో ఎంట్రీ
-
Siddipet District: కసాయి తల్లి.. ప్రియుడితో ఏకాంతానికి అడ్డొచ్చాడని రెండేళ్ల కొడుకును హతమార్చిన వైనం..
-
IPL 2027: రిషభ్ పంత్ రాక.. కేఎల్ రాహుల్ భవిష్యత్తుపై చర్చ!
-
Viral News: రబ్బర్‌ను మింగేసిన 4ఏళ్ల బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!