Team India Bangladesh Tour: నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్‌కు భారత జట్టు..! పూర్తి వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Bangladesh Tour: సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) త్వరలోనే బంగ్లాదేశ్ పర్యటనకు (Bangladesh Tour) వెళ్లే అవకాశం కనిపిస్తోంది. గతంలో రెండుసార్లు వాయిదా పడిన ఈ పర్యటనను ఈ కొత్త ఏడాది అంటే జనవరి 2027లో నిర్వహించేలా బోర్డులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య 6 మ్యాచ్‌ల వైట్ బాల్ సిరీస్ (White-ball Series) జరగనుంది. ఈ పర్యటనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నాయని ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది.
ఈ పర్యటనలో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ఈ సిరీస్‌ను క్యాలెండర్లో సర్దుబాటు చేయడమే ఇప్పుడు ప్రధాన సవాలుగా మారింది. ఎందుకంటే జనవరి 3 నుంచి 9 మధ్య జింబాబ్వే జట్టు (Zimbabwe Team) 3 వన్డేల సిరీస్ కోసం భారత్‌కు రానుంది. ఆ తర్వాత జనవరి 21 నుంచే ఆస్ట్రేలియా (Australia)తో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) ప్రారంభం కానుంది. ఈ టైట్ షెడ్యూల్ మధ్య బంగ్లాదేశ్‌తో 6 మ్యాచ్‌లు ఎలా సాధ్యమవుతాయనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
- PG Medical Seats: పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 161 పీజీ సీట్లు మంజూరు..
- Train Fire Accident: కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఐదు బోగీలకు మంటలు!
- Gold & Silver Price Drop: ధన త్రయోదశి వేళ గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Saltలో ఈ ఒక్క మార్పు చేయండి.. లక్షలాది ప్రాణాలు కాపాడండి! పరిశోధనలో కీలక విషయాలు
బంగ్లాదేశ్ పర్యటనకు మార్గం సుగమం చేసేందుకు గాను జింబాబ్వేతో జరగాల్సిన 3 వన్డేల సిరీస్ షెడ్యూల్‌ను మార్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే దీనిపై కూడా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లు టెస్టు ప్రాక్టీస్ పూర్తి చేసుకోవాల్సి ఉన్నందున, అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, గతంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడుల నేపథ్యంలో, బంగ్లాదేశ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ (Mustafizur Rahman)ను ఐపీఎల్ 2026 (IPL 2026) నుంచి తప్పించారు. ఈ పరిణామంతో ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు ఒక్కసారిగా క్షీణించాయి. ఆ వివాదం ఏకంగా భారత్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ (T20 World Cup)ను బంగ్లాదేశ్ బహిష్కరించే స్థాయికి చేరింది.
అయితే బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, ఆ తర్వాత అమీనుల్ ఇస్లాం స్థానంలో మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal) బీసీబీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో పరిస్థితులు మళ్లీ చక్కబడుతున్నాయి. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు పునరుద్ధరణ దిశగా సాగుతున్నాయి. కాగా, ఈ ప్రతిపాదిత పర్యటనను ఫైనల్ చేసే ముందు బీసీసీఐ భారత ప్రభుత్వం (Indian Government) నుంచి అవసరమైన అనుమతులు పొందాల్సి ఉంది. ఇక, భారత జట్టు చివరిసారిగా డిసెంబర్ 2022లో బంగ్లాదేశ్‌లో పర్యటించింది. ఆ సమయంలో ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఒకవేళ జనవరి 2027లో టీమిండియా ధాకా విమానం ఎక్కితే, దాదాపు నాలుగు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ మళ్లీ బంగ్లాదేశ్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడినట్లవుతుంది.
తాజావార్తలు
-
Team India Bangladesh Tour: నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్‌కు భారత జట్టు..! పూర్తి వివరాలు ఇవే..
-
France Bus Accident : ఫ్రాన్స్‌లో బస్సు బోల్తా.. ఇద్దరు విద్యార్థులు మృతి..?
-
SIR Process : ఓటర్ల జాబితాలో పేరు గల్లంతైందా..?నమోదుకు మళ్లీ అవకాశం ఇచ్చిన ఈసీ
-
Bharat Summit in Hyderabad: హైదరాబాద్‌లో గ్లోబల్ సందడి.. 100 దేశాల ప్రతినిధులతో భారత్ సమ్మిట్
-
PG Medical Seats: పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 161 పీజీ సీట్లు మంజూరు..
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!