Barinder Singh: హాకీ దిగ్గజ క్రీడాకారుడు వరీందర్ సింగ్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత దేశానికి ఎన్నో గొప్ప పతకాలు అందించి, దేశ ఖ్యాతిని చాటిచెప్పిన హాకీ దిగ్గజ క్రీడాకారుడు వరీందర్ సింగ్ (75) అనారోగ్యంతో మంగళవారం నాడు కన్నుమూశారు. 1970లలో దేశం సాధించిన గొప్ప విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఒలింపిక్, ప్రపంచకప్ పతక విజేత వరీందర్ సింగ్ ఇక లేరన్న విషయం తెలుసుకుని క్రీడా ప్రపంచం ఆవేదన చెందుతోంది. 1975 కౌలాలంపూర్ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత హాకీ జట్టులో వరీందర్ సింగ్ సభ్యుడిగా ఉన్నారు. ఫైనల్‌లో 2-1తో పాకిస్థాన్‌ను మట్టికరిపించి ఆ ఏడాది భారత్ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. భారతదేశం పాకిస్థాన్‌ను 2-1తో ఓడించి సాధించిన ఏకైక స్వర్ణ పతకం ఇదే.
Read Also:IND Vs IRE: చరిత్ర సృష్టించిన దీపక్ హుడా-సంజు శాంసన్ జోడీ
Also Read
అంతకుముందు మ్యూనిచ్‌లో జరిగిన 1972 సమ్మర్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, 1973 ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న జట్లలో కూడా వరీందర్ సింగ్ ఆడారు. అతను 1974, 1978లో వరుసగా ఆసియా క్రీడలలో రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఈ భారత దిగ్గజ హాకీ క్రీడాకారుడు 1975లో మాంట్రియల్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో కూడా పాల్గొన్నారు. గౌరవనీయమైన ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును 2007లో వరీందర్ సింగ్ అందుకున్నారు.
తాజావార్తలు
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
-
Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
-
Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. ‘జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!