భారత దేశానికి ఎన్నో గొప్ప పతకాలు అందించి, దేశ ఖ్యాతిని చాటిచెప్పిన హాకీ దిగ్గజ క్రీడాకారుడు వరీందర్ సింగ్ (75) అనారోగ్యంతో మంగళవారం నాడు కన్నుమూశారు. 1970లలో దేశం సాధించిన గొప్ప విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఒలింపిక్, ప్రపంచకప్ పతక విజేత వరీందర్ సింగ్ ఇక లేరన్న విషయం తెలుసుకుని క్రీడా ప్రపంచం ఆవేదన చెందుతోంది. 1975 కౌలాలంపూర్ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత హాకీ జట్టులో వరీందర్ సింగ్ సభ్యుడిగా ఉన్నారు. ఫైనల్‌లో 2-1తో…