భారత దేశానికి ఎన్నో గొప్ప పతకాలు అందించి, దేశ ఖ్యాతిని చాటిచెప్పిన హాకీ దిగ్గజ క్రీడాకారుడు వరీందర్ సింగ్ (75) అనారోగ్యంతో మంగళవారం నాడు కన్నుమూశారు. 1970లలో దేశం సాధించిన గొప్ప విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఒలింపిక్, ప్రపంచకప్ పతక విజేత వరీందర్ సింగ్ ఇక లేరన్న విషయం తెలుసుకుని క్రీడా ప్రపంచం ఆవేదన చెందుతోంది. 1975 కౌలాలంపూర్ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత హాకీ జట్టులో వరీందర్ సింగ్ సభ్యుడిగా ఉన్నారు. ఫైనల్‌లో 2-1తో…
ఒలింపిక్స్‌లో విశేష ప్రతిభ చూపిన ఏపీకి చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ. రజనీకి ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రూ. 25లక్షల నగదు ఇవ్వడమే కాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో ఇవాళ సీఎంను తన తల్లిదండ్రులతో కలిసి రజనీ కలుసుకున్నారు. టోక్యో ఒలిపింక్స్‌లో కాంస్యపతక పోరువరకూ కూడా భారత మహిళల జట్టు దూసుకెళ్లింది. జట్టు విజయాల్లో రజనీ కీలక పాత్ర పోషించారు. రజనీని ముఖ్యమంత్రి శాలువాతో…
తొలి చిత్రం ‘ఉప్పెన’తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. దాదాపు 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘ఉప్పెన’ సినిమా నాలుగు రెట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి సినిమా విడుదలకు ముందే ‘కొండపొలం’ నవల ఆధారంగా క్రిష్ తీసిన సినిమాలో వైష్ణవ్ తేజ్ నటించాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది.…
తొలి చిత్రం ‘ఉప్పెన’తో భారీ హిట్ కొట్టిన మెగా హీరో వైష్ణవ్ తేజ్ హాకీ ప్లేయర్ అవతారం ఎత్తబోతున్నాడట. ఫస్ట్ సినిమాలో లవర్ బోయ్ గా ఆకట్టుకున్న వైష్ణవ్ క్రిష్ తో చేస్తున్న రెండో సినిమా ‘కొండపొలం’లో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రతి సినిమాలోనూ పాత్రల మధ్య వేరియేషన్ చూసించాలనుకుంటున్న వైష్ణవ్ అన్నపూర్ణస్టూడియో పతాకంపై నాగార్జున నిర్మించే సినిమాలో హాకీ క్రీడాకారునిగా కనిపిస్తాడట. ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాకు కొత్త దర్శకుడు పృధ్వీ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇందులో…