Commonwealth Games 2022: భారత్‌కు షాక్.. కామన్వెల్త్ క్రీడలకు నీరజ్ చోప్రా దూరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Commonwealth Games 2022: మరో రెండు రోజుల్లో కామన్వెల్త్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ క్రీడా సంగ్రామం ప్రారంభం కాకముందే భారత్‌కు షాక్ తగిలింది. కచ్చితంగా పతకం సాధిస్తాడనుకున్న స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కామన్వెల్త్ క్రీడలకు దూరమైనట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ రాజీవ్ మెహతా తెలిపారు. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ సందర్భంగా నీరజ్ చోప్రా గాయపడ్డాడని.. దీంతో ప్రస్తుతం అతడు ఫిట్‌గా లేడని ఈ కారణంగా బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనబోడని ఆయన వెల్లడించారు
Read Also: Donation With Begging: మనుషుల్లో ఆణిముత్యం.. భిక్షాటన చేసి రూ.50 లక్షలు దానం ఇచ్చిన వృద్ధుడు
Also Read
- Cristiano Ronaldo: పెనాల్టీకి ముందు ‘బిస్మిల్లా’ అన్నాడా? వీడియో వైరల్.. అసలు ఏం జరిగింది?
- IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్‌కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
- Ravi Shastri: "చాలా పెద్ద తప్పు చేస్తున్నారు".. టీమిండియా మేనేజ్మెంట్పై రవిశాస్త్రి ఫైర్!
- IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
కాగా ఇటీవల జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించాడు. జావెలిన్‌ను 88.13 మీటర్లు విసిరి భారత్‌కు పతకం అందించాడు. 46 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు ఇది రెండో పతకం మాత్రమే. గతంలో మహిళా అథ్లెట్ పతకం నెగ్గగా పురుషులలో మాత్రం ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్ నీరజ్ చోప్రానే కావడం విశేషం. 2003లో పారిస్ వేదికగా జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళా అథ్లెట్ అంజు బాబి జార్జ్ లాంగ్ జంప్ విభాగంలో కాంస్య పతకం గెల్చుకున్నారు. అయితే ఆ టోర్నీ ఫైనల్‌లో తాను కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నానని నీరజ్ చోప్రా స్వయంగా మీడియాకు చెప్పాడు. పరుగెత్తుతున్నప్పుడు కాళ్లలో ఇబ్బందిగా అనిపించిందని పేర్కొన్నాడు. తొడ కండరాలు పట్టేశాయని వివరించాడు. అయితే నీరజ్ చోప్రా త్వరగానే కోలుకుని కామన్వెల్త్ గేమ్స్ ఆడతాడని అందరూ భావించారు.
Neeraj Chopra will not take part in #CommonwealthGames2022. He is not fit as he got injured in the finals of World Athletic Championship. He informed us about this: Rajeev Mehta, Secretary General, IOA to ANI
(File photo) pic.twitter.com/5QgbMaZHuw
— ANI (@ANI) July 26, 2022
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్‌లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్‌లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్‌లో లాంచ్..!