Cristiano Ronaldo: పెనాల్టీకి ముందు ‘బిస్మిల్లా’ అన్నాడా? వీడియో వైరల్.. అసలు ఏం జరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cristiano Ronaldo: పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఫిఫా ప్రపంచకప్ 2026 రౌండ్ ఆఫ్ 32లో క్రొయేషియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా పెనాల్టీ తీసుకునే ముందు రొనాల్డో “బిస్మిల్లా” అని పలికినట్లు కనిపించే వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రపంచవ్యాప్తంగా అభిమానులు విస్తృతంగా షేర్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
టొరంటోలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట క్రొయేషియా తరఫున ఇవాన్ పెరిశిచ్ గోల్ చేసి జట్టుకు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత పోర్చుగల్‌కు లభించిన కీలక పెనాల్టీని రొనాల్డో విజయవంతంగా గోల్‌గా మలిచి స్కోరును సమం చేశాడు. అయితే పెనాల్టీ తీసుకునే ముందు తనలో తాను ఏదో మాట్లాడుకుంటున్నట్లు వీడియోలో కనిపించింది.
Also Read
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్‌ల ప్రకారం.. రొనాల్డో తన రన్-అప్ ప్రారంభించే ముందు మెల్లగా “బిస్మిల్లా” అనే పదాన్ని రెండు సార్లు పలికినట్లు కొందరు అభిమానులు అంటున్నారు. అరబిక్ భాషలో “బిస్మిల్లా” అంటే “దేవుని పేరుతో” అని అర్థం. ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు ముస్లింలు సాధారణంగా ఈ పదాన్ని ఉచ్ఛరిస్తుంటారు. అయితే రొనాల్డో నిజంగా అదే పదాన్ని పలికాడా లేదా అనేది అధికారికంగా నిర్ధారణ కాలేదు. కానీ పెనాల్టీలు లేదా కీలక సందర్భాల్లో తాను మానసికంగా సిద్ధమవుతూ కొన్ని పదాలను తనలో తాను చెప్పుకోవడం రొనాల్డోకు అలవాటేనని మరికొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ పెనాల్టీ గోల్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ దశల్లో రొనాల్డో సాధించిన తొలి గోల్ ఇదే. దీంతో తన అంతర్జాతీయ కెరీర్లో మరో అరుదైన మైలురాయిని అతడు అందుకున్నాడు. అలాగే ప్రపంచకప్ 2026 టోర్నీలో రొనాల్డో చేసిన మూడో గోల్ కూడా ఇదే. అతని గోల్‌తో పోర్చుగల్ మ్యాచ్‌లో తిరిగి పుంజుకోగా.. అదనపు సమయంలో గోన్సాలో రామోస్ చేసిన గోల్‌తో పోర్చుగల్ విజయాన్ని అందుకుంది. ఒకవైపు రొనాల్డో సాధించిన చారిత్రాత్మక గోల్, మరోవైపు ‘బిస్మిల్లా’ వీడియో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియో ఫుట్‌బాల్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
Did Cristiano Ronaldo say 'bismillah' twice before shooting his penalty kick against Croatia? 👀 pic.twitter.com/wOWINH7v1s
— Muslim (@Muslim) July 3, 2026
తాజావార్తలు
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!