భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా లేరు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఎక్కువ సమయం తన స్వస్థలమైన రాంచీలో గడుపుతున్నారు. మహీ తన బైక్స్, పెంపుడు జంతువులు, ఫామ్‌హౌస్‌లో సేంద్రీయ వ్యవసాయాన్ని ఆస్వాదిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఐదేళ్లయినా అయినప్పటికీ అభిమానులలో ధోనీ పట్ల క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ధోనీ క్రికెట్ మైదానంకు దూరమై…