డిసెంబర్ 4న జరగనున్న బీసీసీఐ ముఖ్యమైన ఎన్నికల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ప్రాతినిధ్యం వహించనున్నాడు భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్. అయితే ఇన్ని రోజులుగా తప్పుడు కారణాలు.. అలాగే అంతర్గత గొడవల కారణంగా వార్తల్లో నిలిచినా మన హెచ్‌సీఏకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు అనే సందేహం అందరికి కలిగింది. ఈ అంతర్గత గొడవలు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. ఇక సుప్రీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం హెచ్‌సీఏ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలను విచారించేందుకురిటైర్డ్ న్యాయమూర్తులతో ఓ బృందాన్ని నియమిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
ఇది ఇలా ఉంటె హెచ్‌సీఏ లో ఉన్న ఆధిపత్య పోరులో అజహరుద్దీన్‌కు ఆధిక్యత ఉంది అనేది తెలుస్తుంది. అయితే అజారుద్దీన్ నియమించిన సెలక్షన్ కమిటీ అండర్-19 జట్టును వినూ మన్కడ్ టోర్నీకి అలాగే.. సయ్యద్ ముస్తాక్ అలీ టీ 20 టోర్నమెంట్ లో హైదరాబాద్ తరపున పాల్గొనేందుకు జట్లను ఎంపిక చేసింది. వినూ మన్కడ్ మరియు ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లలో రెండు జట్లు అద్భుతంగా రాణించి సెమీఫైనల్ వరకు వచ్చాయి.