BCCI President: భారత క్రికెట్ నియంత్రణ మండలిలో కీలక మార్పు చోటు చేసుకుంది. టీమిండియా 1983 వరల్డ్ కప్ హీరో రోజర్ బిన్ని బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బోర్డు వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న రాజీవ్ శుక్ల తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరిగే వరకు శుక్లానే బోర్డును నడిపించనున్నారు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన బీసీసిఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం రాజీవ్ శుక్లా నేతృత్వంలో…
BCCI Elections: బీసీసీఐ ఎన్నికలకు నగరా మోగింది. ఈ మేరకు ఆదివారం నాడు బీసీసీఐ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. బీసీసీఐ ఆఫీసు బేరర్ల పదవుల కోసం అక్టోబరు 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబరు 18న ముంబైలో ఎన్నికలు జరగనుండగా, ఫలితాలు అదే రోజున అధికారులు వెల్లడిస్తారు. ప్రస్తుతం బీసీసీఐకి అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, కార్యదర్శిగా జై షా వ్యవహరిస్తున్నారు. అయితే గంగూలీ ఐసీసీ చైర్మన్ పదవిని చేపట్టే అవకాశం ఉందని, జై షా బీసీసీఐ…
డిసెంబర్ 4న జరగనున్న బీసీసీఐ ముఖ్యమైన ఎన్నికల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ప్రాతినిధ్యం వహించనున్నాడు భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్. అయితే ఇన్ని రోజులుగా తప్పుడు కారణాలు.. అలాగే అంతర్గత గొడవల కారణంగా వార్తల్లో నిలిచినా మన హెచ్‌సీఏకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు అనే సందేహం అందరికి కలిగింది. ఈ అంతర్గత గొడవలు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. ఇక సుప్రీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్…