Without Kohli In Cricket: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు వన్డేల్లో విరాట్ కోహ్లీ అద్భుత శతకాలు సాధించి మరోసారి భారత క్రికెట్ ప్రపంచాన్ని అలరించాడు. రెండో వన్డేలో శతకం కొట్టినా, జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. అయినప్పటికీ అతని బ్యాటింగ్ శైలి, ఆట పట్ల ఉన్న నిబద్ధతపై సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి. కాగా, టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ మహ్మద్ కైఫ్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. కోహ్లీ సెంచరీ సాధించిన తర్వాత కైఫ్ “Without Kohli ODI Cricket Is Nothing.. Pure Vintage!” అని రాసుకొచ్చాడు, ఆ తర్వాత పోస్టును సవరించి “Without Kohli Cricket Is Nothing..” అని మార్చడంతో అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
Read Also: Putin’s Security: పుతిన్ సెక్యూరిటీ ఎంత ఖతర్నాక్ అంటే, టచ్ చేస్తే చావే..
అయితే, వీరేందర్ సెహ్వాగ్ కూడా తనదైన శైలిలో కోహ్లీని ప్రశంసిస్తూ.. విరాట్ కి శతకాల నషా వేరే లెవెల్.. 53వ వన్డే సెంచరీలు కొట్టడం అసాధ్యమే అన్నారు. అలాగే, రుతురాజ్ గైక్వాడ్ సెంచరీపై ప్రశంసలు కురిపించాడు. ఇక, మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. క్రికెట్ లో కోహ్లీ ఆధిపత్యాన్ని కొనియాడారు. కోహ్లీ అద్భుతమైన శతకం చేశాడు.. “బ్యాక్ టూ బ్యాక్ శతకాలతో బీస్ట్ మోడ్ యాక్టివేటెడ్ అంటూ కోహ్లీ ఫాంపై ప్రశంసలు కురిపించాడు. కాగా, భారత మహిళల జట్టు ఓపెనర్ ప్రతికా రవాల్ కూడా “Form is temporary, Kohli is forever” అంటూ ప్రశంసించింది.
Read Also: Modi-putin: పుతిన్‌ను స్వయంగా స్వాగతించనున్న మోడీ.. ఒకే కారులో ప్రయాణం.!
ఇక, దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ రికార్డులు చూస్తే అతని ఆధిపత్యాన్ని ఎంటో స్పష్టంగా కనిపిస్తుంది. 33 వన్డేల్లో 1,741 రన్స్, 69.64 సగటు, 7 శతకాలతో ప్రోటియాస్‌పై అత్యధిక వన్డే సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వరుస వన్డే మ్యాచ్‌లలో శతకాలను 11వ సారి కావడం గమనార్హం. అయితే, రాయపూర్ వన్డేలో కోహ్లీ (102)- రుతురాజ్ గైక్వాడ్ (105)ల మధ్య 195 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.. ఆ తర్వాత కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్‌లతో భారత్ 358 పరుగులు చేసింది. అయితే, ఐడెన్ మార్క్రామ్, మ్యాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్ ఆడిన కీలక ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.
Without Kohli cricket is nothing.. pure vintage!
— Mohammad Kaif (@MohammadKaif) December 3, 2025
Virat Kohli ko 100 ka nasha hi alag hai. Hum log centuries gin rahe hote hain, woh bas routine ka kaam samajh ke kar deta hai.
Back-to-back 100‘s for the King. 53rd ODI hundred. Virat hai toh mumkin hai. A brilliant century from Ruturaj Gaikwad as well making batting look very… pic.twitter.com/afDYqC9N6k— Virrender Sehwag (@virendersehwag) December 3, 2025
On Sunday king plays for sure but on weekdays he plays with your plans. Brilliant 100 by Virat Kohli. pic.twitter.com/YIMpQ4Zifo
— Irfan Pathan (@IrfanPathan) December 3, 2025