టెన్నిస్ స్టార్ ప్లేయర్ మరియా షరపోవా తన అభిమానులకు శుభవార్త అందించింది. మంగళవారం నాడు ఆమె 35వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ గుడ్‌న్యూస్‌ను షేర్ చేసింది. తాను త్వరలోనే తల్లిని కాబోతున్నట్లు స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఈ మేరకు బీచ్‌లో నవ్వుతున్న ఫోటోను పోస్ట్ చేసింది. షరపోవాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.2 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఆమె గుడ్ న్యూస్ చెప్పిన మరుక్షణమే ఈ వార్త వైరల్‌గా నిలిచింది.
కాగా రష్యా క్రీడాకారిణి అయిన షరపోవా ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ టైటిల్ విన్నర్‌గా నిలిచింది. గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన రష్యన్ మహిళగా ఆమె రికార్డు సృష్టించింది. 2020లో ఆమె టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది. గత డిసెంబర్లో బ్రిటీష్ బిజినెస్మెన్ అలెగ్జాండర్ గిల్స్క్ ను ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు షరపోవా వెల్లడించింది. అలెగ్జాండర్ గిల్స్క్ న్యూయార్క్‌లో సెటిలైన బ్రిటీష్ బిజినెస్ మ్యాన్. అతడితో వివాహమైన నాటి నుంచి షరపోవా యునైటెడ్ స్టేట్స్లోనే నివసిస్తోంది.