రష్యాకు చెందిన టెన్నిస్ మాజీ స్టార్ మరియా షరపోవా మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పటివరకు షరపోవాకు పెళ్లి కాలేదు. అయితే ఆమె పెళ్లి కాకుండానే తల్లి కావడంతో ఆమె అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాబోయే భర్త అలెగ్జాండర్ గిల్క్స్‌తో కలిసి కొంతకాలంగా ఆమె సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె జూలై 1వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా షరపోవా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. తమ బాబుకు థియోడర్ అని పేరు పెట్టినట్లు…
టెన్నిస్ స్టార్ ప్లేయర్ మరియా షరపోవా తన అభిమానులకు శుభవార్త అందించింది. మంగళవారం నాడు ఆమె 35వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ గుడ్‌న్యూస్‌ను షేర్ చేసింది. తాను త్వరలోనే తల్లిని కాబోతున్నట్లు స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఈ మేరకు బీచ్‌లో నవ్వుతున్న ఫోటోను పోస్ట్ చేసింది. షరపోవాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.2 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఆమె గుడ్ న్యూస్ చెప్పిన మరుక్షణమే ఈ వార్త వైరల్‌గా…