Mahendra Singh Dhoni: విజయవాడలో ధోనీ విగ్రహం.. ఖుషీ అవుతున్న అభిమానులు
Mahendra Singh Dhoni: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనప్పటికీ అతడి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా విజయవాడలో క్రికెట్ అభిమానులు ధోనీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో ధోనీ విగ్రహం కనిపిస్తోంది. ప్రస్తుతం ధోనీ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్‌లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్రికెటర్‌కు విగ్రహం పెట్టడం బహుశా ఇదే తొలిసారని కొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అటు ధోనీ వచ్చే ఐపీఎల్‌లో కూడా ఆడనున్నాడు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు తన సారథ్యంలో ధోనీ ఎన్నోసార్లు టైటిల్ అందించాడు. 2021లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవగా 2022 సీజన్‌లో మాత్రం పేలవ ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్‌లో సీఎస్‌కే మరోసారి విజృంభించి ధోనీకి గ్రాండ్ వీడ్కోలు పలకాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Read Also: Salman Khan: రూ. 1000 కోట్లు రెమ్యూనిరేషన్.. నా కేసులకే సరిపోవు
Also Read
- Players Caught Vaping: మ్యాచ్ మధ్యలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన ప్లేయర్స్ వీళ్లే..
- MI vs SRH: ముంబైకి చావో రేవో.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడిపోతే అంతే సంగతి..
- Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. "ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం".. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కెప్టెన్..
ధోనీ సారథ్యంలో టీమిండియా అన్ని రకాల ఐసీసీ టైటిళ్లను సొంతం చేసుకుంది. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ సహా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా గెలుచుకుంది. అటు టెస్టుల్లోనూ నంబర్‌వన్ ర్యాంకును సాధించింది. టీమిండియా తరఫున విజయవంతమైన కెప్టెన్ అంటే ధోనీ పేరు మాత్రమే గుర్తొస్తుంది. ధోనీ సారథ్యంలో కోహ్లీ, రోహిత్, రైనా, జడేజా, రాయుడు, ధావన్ లాంటి ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. మొత్తానికి విజయవాడలో ధోనీ విగ్రహం ఏర్పాటు చేస్తుండటంతో అతడి అభిమానులు ఖుషీ అవుతున్నారనే చెప్పాలి. కానీ విజయవాడలో ఈ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టత రావాల్సి ఉంది.
MS Dhoni's statue in Vijayawada👌
📸: @TeluguMSDians pic.twitter.com/1PkoyyscrQ
— CricTracker (@Cricketracker) September 28, 2022
తాజావార్తలు
-
Mukesh Ambani: స్టాక్ మార్కెట్‌లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
-
E85 Petrol: పెట్రోల్‌లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
-
Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్‌కు లాభం, పాకిస్తాన్‌కు నష్టం..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో