NZ Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్స్ అవుట్.. కీలక మార్పులు చేసిన బీసీసీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న వన్డే సిరీస్ కోసం బీసీసీఐ సీనియర్ జట్టుతో పాటు ‘ఇండియా-ఎ’ జట్టులో పలు కీలక మార్పులను ప్రకటించింది. గాయం నుంచి కోలుకుంటున్న బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఇంకా పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించకపోవడంతో న్యూజిలాండ్తో జరిగే ఐదు వన్డేల సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతను మ్యాచ్ ఫిట్నెస్ సాధించేందుకు వీలుగా, బోర్డు నిర్వహించే ఫిట్నెస్ పరీక్ష ఉత్తీర్ణులైన తర్వాత ‘ఇండియా-ఎ’ జట్టులో చేరి ముడో నాలుగు రోజుల మ్యాచ్ ఆడనున్నాడు. తద్వారా త్వరలో జరగబోయే కీలకమైన టెస్టు సిరీస్కు సమర్థవంతంగా సిద్ధమయ్యే అవకాశం అతనికి లభిస్తుంది.
మరోవైపు స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ అక్టోబర్ 31 నుంచి న్యూజిలాండ్-ఎ జట్టుతో ప్రారంభమయ్యే రెండో నాలుగు రోజుల మ్యాచ్ కోసం ‘ఇండియా-ఎ’ జట్టుతో జతకట్టనున్నాడు. ప్రస్తుతం ప్రకటించిన ‘ఇండియా-ఎ’ జట్టుకు ధ్రువ్ జురెల్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, పడిక్కల్, ఆకాష్ దీప్, ముకేష్ కుమార్లతో కూడిన బలమైన బృందం బరిలోకి దిగుతోంది. అలాగే ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి నవంబర్ 4న జరిగే తొలి వన్డే కోసం భారత సీనియర్ జట్టుతోనే ఉంటాడు. ఆ తర్వాత టెస్టు సిరీస్ సన్నాహకాల్లో భాగంగా నితీష్ కూడా మూడో నాలుగు రోజుల మ్యాచ్ కోసం ‘ఇండియా-ఎ’ జట్టులోకి వెళ్తాడు.
Also Read
- Madras High Court: CJP నేత సౌరవ్ దాస్ ఎవరు.? బ్యాక్గ్రౌండ్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
- IND vs NZ 4th T20: టీమిండియా ముందు భారీ లక్ష్యం.. భారత్ గెలిస్తే రికార్డే పో..
- CM Revanth Reddy: "భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు".. సుప్రీం తీర్పుపై రేవంత్రెడ్డి హర్షం
- Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
ఇక సీనియర్ జట్టు విషయానికి వస్తే.. తొలి మూడు వన్డేలకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వంటి దిగ్గజాలు ఉన్నారు. చివరి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరిస్తాడు. ఆఖరి రెండు వన్డేలలో తిలక్ వర్మ, ఆకిబ్ నబీ, యశ్ ఠాకూర్ వంటి యువ ఆటగాళ్లకు చోటు లభించింది. నవంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్కు ముందు ఆటగాళ్లందరికీ తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించడమే లక్ష్యంగా బిసిసిఐ ఈ మార్పులు చేపట్టింది.
తాజావార్తలు
-
NZ Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్స్ అవుట్.. కీలక మార్పులు చేసిన బీసీసీఐ..
-
Madras High Court: CJP నేత సౌరవ్ దాస్ ఎవరు.? బ్యాక్గ్రౌండ్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
-
Fake Aadhar: నిమిషాల్లో నకిలీ ఆధార్, పాన్ కార్డులు.. గుట్టురట్టు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు..
-
IND vs NZ 4th T20: టీమిండియా ముందు భారీ లక్ష్యం.. భారత్ గెలిస్తే రికార్డే పో..
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
ట్రెండింగ్
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!