Fire Accident: విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్‌లో అగ్నిప్రమాదం.. సీ హార్స్ జంక్షన్ సమీపంలో ఎగిసిపడుతున్న మంటలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఆవరణలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సీ హార్స్ జంక్షన్ సమీపంలో నిర్మిస్తున్న కన్వేయర్ బెల్ట్‌లో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ జె.ఎం. భక్షి పరిధిలో నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం సుమారు 1.45 గంటల సమయంలో కన్వేయర్ బెల్ట్ వద్ద నల్లటి దట్టమైన పొగలు, మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానిక సిబ్బంది, కార్మికులు తక్షణమే రక్షణ చర్యల కోసం అధికారులకు సమాచారం అందించారు. పోర్ట్ ప్రాంతంలో ఎగసిపడిన దట్టమైన పొగ కిలోమీటరు దూరంలో ఉన్న నగరం వైపుకు కూడా వ్యాపించడంతో స్థానికులు కలవరపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఫైర్ సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేస్తూ పోర్ట్ ట్రస్ట్ అగ్నిమాపక యంత్రాలతో పాటు విశాఖపట్నం నగర అగ్నిమాపక శాఖకు చెందిన పలు ఫైర్ ఇంజన్లను రంగంలోకి దించారు. వాటర్ టెండర్ల సహాయంతో సిబ్బంది శ్రమించి మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా యత్నించారు.
Also Read
- Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి.?
- NZ Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్స్ అవుట్.. కీలక మార్పులు చేసిన బీసీసీఐ..
- Madras High Court: CJP నేత సౌరవ్ దాస్ ఎవరు.? బ్యాక్‌గ్రౌండ్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
- IND vs NZ 4th T20: టీమిండియా ముందు భారీ లక్ష్యం.. భారత్ గెలిస్తే రికార్డే పో..
వెల్డింగ్ పనుల వల్ల ఏర్పడిన నిప్పురవ్వలు కన్వేయర్ బెల్ట్ మెటీరియల్‌కు అంటుకోవడం వల్ల లేదా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చునని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్ట్ వ్యవస్థ భారీగా దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే, ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి రెస్క్యూ చేపట్టి మంటలు పక్కనే ఉన్న ప్రమాదకరమైన ఇతర దిగుమతి సరుకులకు, బల్క్ కార్గో బెర్తులకు వ్యాపించకుండా నిరోధించగలిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోర్ట్ అధికారులు, పోలీసులు ఈ అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై , జరిగిన ఆస్తి నష్టంపై దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Fire Accident: విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్‌లో అగ్నిప్రమాదం.. సీ హార్స్ జంక్షన్ సమీపంలో ఎగిసిపడుతున్న మంటలు..
-
Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి.?
-
NZ Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్స్ అవుట్.. కీలక మార్పులు చేసిన బీసీసీఐ..
-
Madras High Court: CJP నేత సౌరవ్ దాస్ ఎవరు.? బ్యాక్‌గ్రౌండ్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
-
Fake Aadhar: నిమిషాల్లో నకిలీ ఆధార్, పాన్ కార్డులు.. గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!