IND vs NZ 4th T20: టీమిండియా ముందు భారీ లక్ష్యం.. భారత్ గెలిస్తే రికార్డే పో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NZ 4th T20: ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా భారత్, నూజిలాండ్ మధ్య జరుగుతున్న నాల్గో టీ20 మ్యాచ్‌లో కీవీస్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 259 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత్ ముందు 260 పరుగుల అతిపెద్ద టార్గెట్‌ను ఉంచింది. ఈ మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. భారత బౌలర్లను ఉతికిపారేస్తూ కేవలం 49 బంతుల్లోనే 107 పరుగుల విధ్వంసకర శతకం బాదాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 10 గగనసుల అద్భుతమైన సిక్సర్లు ఉన్నాయి. అతనికి తోడుగా మైఖెల్ బ్రేస్‌వెల్ కూడా కేవలం 25 బంతుల్లోనే 65 పరుగులు చేసి న్యూజిలాండ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
తొలుత అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత బౌలర్లు ఆరంభంలో వికెట్లు తీసినప్పటికీ, చివర్లో కీవీస్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. మయాంక్ యాదవ్ తన తొలి ఓవర్ చివరి బంతికే టిమ్ సీఫర్ట్ (3)ను ప్రిన్స్ యాదవ్ చేతిలో క్యాచ్‌గా అవుట్ చేసి తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత తన వేగంతో మిచెల్ (24)ను అద్భుతమైన యార్కర్‌తో ఎల్బీడబ్ల్యూ చేశాడు. అక్షర్ పటేల్ తన బౌలింగ్‌లో ఫిన్ అలెన్(31)ను పెవిలియన్‌కు పంపగా, మయాంక్ యాదవ్ మరోసారి షార్ట్ పిచ్ బంతితో బెవెన్ జాకబ్స్ (7)ను అవుట్ చేసి తన వేగం ఏంటో నిరూపించాడు.
Also Read
- CM Revanth Reddy: "భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు".. సుప్రీం తీర్పుపై రేవంత్‌రెడ్డి హర్షం
- Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
- Indian Navy: భారత నౌకాదళంలోకి 8 కొత్త స్టెల్త్ యుద్ధనౌకలు.. రూ. 40 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
- World Bank Report: పేదరిక నిర్మూలనలో భారత్ రికార్డు.. 12 ఏళ్లలో 49.6 కోట్ల మందికి విముక్తి.. కానీ..
మధ్యలో ప్రిన్స్ యాదవ్ వేసిన అద్భుతమైన యార్కర్‌కు మైకెల్ బ్రేస్‌వెల్ (65) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగినా, అప్పటికే స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఇక అర్షదీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మిచెల్ సాంట్నర్ (5)ను అవుట్ చేయడంతో పాటు టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్లో తన 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ (107) క్యాచ్‌గా వెనుదిరిగాడు. సెంచరీ పూర్తి చేసుకుని వెళ్తున్న ఫిలిప్స్‌ను ఈడెన్ పార్క్ స్టేడియంలోని ప్రేక్షకులు అందరూ లేచి నిలబడి అభినందించారు.
తాజావార్తలు
-
IND vs NZ 4th T20: టీమిండియా ముందు భారీ లక్ష్యం.. భారత్ గెలిస్తే రికార్డే పో..
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
CM Revanth Reddy: “భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు”.. సుప్రీం తీర్పుపై రేవంత్‌రెడ్డి హర్షం
-
Hero Destini 110: హీరో Destini 110 Classique Edition లాంచ్.. 785mm సీటు, ఇంజిన్, పవర్, ధర వివరాలు!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!