#NBKxKoratalaSiva: ఆ వార్తలు నిజం కాదు.. తేల్చేసిన టీమ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
#NBKxKoratalaSiva: నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై టాలీవుడ్లో ఎంతటి హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే రెండు మూడు రోజులుగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఫలానా మ్యూజిక్ డైరెక్టర్‌ను లాక్ చేసేశారంటూ నెట్టింట ఒకటే హడావుడి, రకరకాల వార్తలు వైరల్ అయిపోయాయి. ఫ్యాన్స్ కూడా అది నిజమేనేమో అనుకుని తెగ షేర్లు చేసేశారు. ఈ ప్రచారం బాగా ఎక్కువైపోవడంతో చివరకు సినిమా నిర్మిస్తున్న ఎస్ఎల్వీ సినిమాస్ వాళ్లు, డైరెక్టర్ కొరటాల శివ టీం వాళ్లు స్వయంగా రంగంలోకి దిగి ఈ ఊహాగానాలన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు.
సినిమాకు సంబంధించి బయట వస్తున్న రూమర్స్ ఏవీ నమ్మొద్దని సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం స్పష్టం చేసింది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎంపికపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఎవరినీ ఇంకా ఫైనల్ చేయలేదని తేల్చి చెప్పారు. త్వరలోనే అన్ని విషయాలు తామే అధికారికంగా వెల్లడిస్తామని, అప్పటివరకు కాస్త ఓపిక పట్టాలని ఫ్యాన్స్‌ను కోరారు. దాంతో ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లన్నీ ఒట్టి పుకార్లేనని తేలిపోయింది. మరి బాలయ్య మాస్ బాడీ లాంగ్వేజ్‌కు, కొరటాల స్టైల్‌కు తగ్గట్టు ఆ అదిరిపోయే బాణీలు కట్టే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలని ఫ్యాన్స్ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
Also Read
- Amala Akkineni: అక్కినేని కోడళ్లపై అమల ఆసక్తికర వ్యాఖ్యలు! అఖిల్ భార్యపై స్పెషల్ కామెంట్స్..
- Vijay Antony : లక్షల విలువైన స్మార్ట్ వాచ్‌లు విసిరేసి చనిపోయిన కూతురి వాచ్‌తో విజయ్ ఆంటోనీ
- Ramayana : బాక్సాఫీస్‌పై 'రామాయణ' దండయాత్ర.. 12 రోజుల్లో కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ రికార్డులు గల్లంతు!
- Ramya Krishnan: క్యాస్టింగ్ కౌచ్ నిన్న జరిగింది, నేడు జరుగుతోంది, రేపూ జరుగబోతుంది..!
Don’t believe or fall for any rumours or speculation regarding our film #NBKxKoratalaSiva.
The music director is still under discussion and has not been officially confirmed yet.
An official announcement will be made soon.Stay tuned! ❤️@SLVCinemasOffl
— Team Koratala (@TeamKoratala) October 30, 2026
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్‌పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!