క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ 15 ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలిసారిగా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈ జట్టు బరిలోకి దిగబోతోంది. అయితే కోల్‌కతా జట్టు ముగ్గురు విదేశీయులనే జట్టులోకి తీసుకోవడం గమనార్హం. శ్యామ్ బిల్లింగ్స్, రస్సెల్, నరైన్‌లను మాత్రమే తుది జట్టులో స్థానం కల్పించింది. మరోవైపు చెన్నై సూపర్‌కింగ్స్ కాన్వే,…
క్రికెట్ ప్రేమికులకు అసలైన మజా ప్రారంభం కాబోతోంది.. క్రికెట్‌లో పొట్టి పార్మాట్ అయిన టీ-20 మ్యాచ్‌లకు మంచి క్రేజ్ ఉంది.. ఇక, ఐపీఎల్‌లో అది మరింత పీక్‌కు వెళ్లింది.. కరోనా కంటే ముందు స్టేడియానికి వెళ్లే సందడి చేస్తే.. కోవిడ్ కారణంగా టీవీల ముందు ఎంజాయ్ చేశారు.. ఇప్పుడు పరిస్థితులు మళ్లీ కొంత మారడంతో.. స్టేడియానికి వెళ్లే అవకాశం మళ్లీ వచ్చేసింది.. ఇక, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ ఇవాళే షురూకానుంది..…
మరో వారం రోజుల్లో ఐపీఎల్-15 సీజన్ ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటి నుంచే అన్ని జట్లు మైదానంలోకి అడుగుపెట్టి ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో ఇంకా బాధపడుతున్నాడని.. అతడు ప్రారంభ మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడని ప్రచారం జరుగుతోంది. గత ఏడాదితో భారత్‌తో టెస్ట్ సిరీస్ అనంతరం కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో అతడు ఫిట్‌గా లేడని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే సన్‌రైజర్స్…
ఐపీఎల్-15 సీజన్‌కు సమయం దగ్గర పడుతోంది. మార్చి నెలాఖరు నుంచే ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. అయితే ఇప్పటివరకు భారత్‌లోనే ఈ మెగా టోర్నీని నిర్వహిస్తామని బీసీసీఐ చెప్తున్నా.. కరోనా కేసుల నేపథ్యంలో దక్షిణాఫ్రికా లేదా దుబాయ్‌లో నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి తరుణంలో ఐపీఎల్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ మ్యాచ్‌లకు ఇంగ్లండ్ ఆటగాళ్లు దూరం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లను వేలంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తాయో లేదో అన్న…
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కొత్తగా అడుగుపెట్టబోతున్న లక్నో ఫ్రాంచైజీకి అధికారులు నామకరణం చేశారు. ఇకపై లక్నో ఫ్రాంచైజీని లక్నో సూపర్ జెయింట్స్ అని పిలవనున్నారు. తమ ఫ్రాంచైజీకి పేరును సూచించాలంటూ లక్నో జట్టు సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించింది. ఈ క్రమంలో లక్నో ఫ్రాంచైజీ అధినేత సంజీవ్ గోయెంకా తమ జట్టు పేరును అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు టీమ్ లోగోను కూడా ఆవిష్కరించారు. అయతే ఈ పేరు గతంలో ఆడిన పూణె జట్టుకు ఉండేది.…
ప్రపంచ క్రికెట్ అభిమానుల ఫేవరెట్ లీగ్ ఐపీఎల్ ఇంకో రెండు నెలల్లో మొదలు కానుంది. ఐపీఎల్ 15వ సీజన్‌ను ఈ ఏడాది కాస్త ముందుగానే.. అంటే మార్చి నెలాఖరులోనే ప్రారంభించడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ధ్రువీకరించారు. స్వదేశంలోనే ఐపీఎల్ నిర్వహించేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని… కరోనా కేసులు అదుపులోకి రాని పక్షంలో లీగ్‌ను మరోసారి విదేశానికి తరలించక తప్పదన్నారు. భారత్‌లోనే లీగ్ జరగాలని అన్ని ఫ్రాంచైజీల యజమానులు…