సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్లు కె.ఎల్.రాహుల్ సెంచరీ సాధించాడు. మొత్తం 218 బంతులు ఎదుర్కొన్న కె.ఎల్.రాహుల్ 14 ఫోర్లు ఒక సిక్సర్ తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో కె.ఎల్.రాహుల్ కు ఇది ఏడో సెంచరీ. 99 పరుగుల వద్ద మహారాజ్ బౌలింగ్లో ఫోర్ కొట్టిన రాహుల్… శతకం పూర్తి చేసుకున్నాడు.
ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు… కె.ఎల్.రాహుల్ మరియు మయాంక్ మంచి శుభారంభాన్ని అందించారు. ఇద్దరు కలిసి తొలి వికెట్ కు 117 పరుగులు జోడించి శభాష్ అనిపించారు. 60 పరుగులు చేసిన మయాంక్… లుంగీ ఎంగిడీ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన పుజారా తొలి బంతికే డకౌట్ అయ్యాడు. అటు టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. ఇక ప్రస్తుతం కేఎల్ రాహుల్ 104 పరుగులు, రహానే 25 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.