Shock : అమ్మాయి కడుపులో అరకేజీ వెంట్రుకలు.. ఆపరేషన్ చేసిన డాక్టర్లే షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shock : ఓ అమ్మాయికి ఆపరేషన్ చేసిన వైద్యులు కంగుతిన్నారు. ఆ అమ్మాయి కడుపులో దాదాపు అరకేజీ వెంట్రుకల ఉండను తొలగించారు. ఇలాంటి అరుదైన శస్త్ర చికిత్సకు మైసూరులోని అపోలో ఆస్పత్రి వేడుకైంది. ఓ 11ఏళ్ల బాలిక ఒత్తిడిలో ఉన్నప్పుడల్లా నెత్తిమీద వెంట్రుకలను తీనడం అలవాటు చేసుకుంది. అలా ఎనిమిది నెలలపాటు తల్లిదండ్రులకు తెలియకుండా తల వెంట్రుకలను పీక్కుతినేది.. ఈ క్రమంలో ఆమె కడుపునొప్పికి గురైంది. ఎన్ని ఆస్పత్రులకు తీసుకెళ్లినా నయం కాలేదు. ఆఖరుకు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌కు చూపించగా, ఆమెను క్షుణ్ణంగా పరీక్షించి ఎండోస్కోపీ చేశారు.
Read Also: Brazil President: బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా లులా డ సిల్లా
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ఆ అమ్మాయి కడుపులో ఒక పెద్ద ఉండ ఉన్నట్లు కనుగొన్నారు. ప్రస్తుతం అది ఆహార పదార్థాలతో కలిపి గడ్డగా మారింది. అప్పుడు వైద్యులు ఆమెకు లాపరోస్కోపిక్ ఆపరేషన్ చేశారు. 15 x 20 x 5 సెం.మీ. కొలతలు కలిగి 500గ్రాముల బరువున్న వెంట్రుకల ఉండను వైద్యులు తొలగించారు. మైసూరులోని అపోలో బిజిఎస్ హాస్పిటల్స్‌లోని చీఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ నైరుత్య శివతీర్థన్ ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ఆర్తీ బెహ్ల్ ఆ యువతికి కౌన్సెలింగ్ ఇచ్చినప్పుడు ఒత్తిడికి గురైనప్పుడల్లా నెత్తిమీద వెంట్రుకలను తినడం తన అలవాటని ఆమె పేర్కొంది. తీవ్ర కడుపునొప్పితో ఆ బాలిక స్కూల్ కి వెళ్లడం కూడా మానేసింది. ఆపరేషన్ అనంతరం ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!