ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లోని అగ్రశ్రేణి జట్లలో టీమిండియా ఒకటి. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. అటు వన్డే, ఇటు టీ20లలో టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గానూ నిలిచింది. టెస్టుల్లోనూ అగ్రస్థానంలో కొన్నాళ్ల పాటు కొనసాగింది. అయితే 1983లో టీమిండియా పసికూన . ఆ ఏడాది జరిగి వన్డే ప్రపంచకప్‌లో అండర్ డాగ్‌గా బరిలోకి దిగింది. ఆనాడు టీమిండియాపై ఎలాంటి అంచనాలు లేవు. సెమీస్‌కు వెళ్తే అదే గొప్ప అనే అభిప్రాయంలో క్రికెట్ పండితులు ఉన్నారు. కానీ కపిల్ దేవ్…