Ishant Sharma Shocking Comments On MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ‘కెప్టెన్ కూల్’ అని పిలుస్తారనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే.. మైదానంలో ఫీల్డర్లు తప్పు చేసినా, మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్నా, మ్యాచ్ చేజారే పరిస్థితిలో ఉన్నా.. అతడు ఆవేశం కోల్పోడు. చాలా కూల్‌గానే కనిపిస్తాడు. అందుకే, అతనికి ఆ పేరు వచ్చింది. అయితే.. ధోనీ అందరూ అనుకునేంత కూల్ కాదని, విరాట్ కోహ్లీతో పాటు టీమ్ సభ్యులందరినీ తిట్టాడంటూ ఇషాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫీల్డ్‌లో తనపై కూడా చాలాసార్లు అరిచాడని కుండబద్దలు కొట్టాడు.
Lavanya Tripathi: మెగా కోడలు ఒక్కతే వెకేషన్ ఎంజాయ్ చేస్తుందే..
ఇషాంత్ మాట్లాడుతూ.. ‘‘ధోనీ సైలెంట్‌గా ఓ మూలకు కూర్చున్నాడంటే, అప్పుడు అతడు ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆ టైమ్‌లో ఎవరైనా వెళ్లి డిస్టర్బ్ చేస్తే, ఇక అంతే సంగతులు. అందరూ ధోనీని కూల్ అంటుంటారు కానీ, అతనేమీ అంత కూల్ కాదు. అలాగని అంతనికి అంత కోపం కూడా రాదు. అతడు ఫీల్డ్‌లో నాపై చాలాసార్లు అరిచాడు. నేను ఒకట్రెండు సార్లు భయపడ్డాను కూడా. నేను వేసిన త్రో ధోనీ గ్లవ్స్ దాకా వెళ్లకపోతే, కోపంతో గట్టిగా అరిచేస్తాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో.. నేను రవి బొపార క్యాచ్ మిస్ చేశాను. నేను క్యాచ్ అందుకునేలోపు అది నేల మీద పడింది. అప్పుడు ధోనీ నావైపు చాలా కోపంగా చూశాడు. కాసేపు తర్వాత నా దగ్గరికి వచ్చి, ‘నువ్వు ఫీల్డింగ్ చేయలేకపోతే అక్కడ నిలబడకు’ అని చెప్పాడు’’ అంటూ ఇషాంత్ పాత రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.
Uttar Pradesh Crime: 10 రోజులు మనవడి శవంతో గడిపిన అమ్మమ్మ.. అలా బయటపడ్డ రహస్యం
ధోనీ తన ప్లేయర్లపై కోప్పడతతాడని, తనతో పాటు విరాట్ కోహ్లీని కూడా చాలా సార్లు తిట్టాడని ఇషాంత్ వెల్లడించాడు. అయితే.. తిట్టిన తర్వాత తమ్ముడిలా అనుకుని అలా తిట్టానని ధోనీ అంటాడని పేర్కొన్నాడు. అసలు ఎందుకిలా ఊరికే తిడతావని ఓసారి అడిగితే, నువ్వంటే చాలా ఇష్టమని ధోనీ సమాధానం చెప్పాడన్నాడు. అతడు బౌలింగ్ మీటింగ్‌కి ఎప్పుడూ రాడని, పరిస్థితిని బట్టి ఫీల్డ్‌లో ఏం చేయాలో, అది చేయనివ్వండని అంటాడని చెప్పాడు.