Lavanya Tripathi: అందాల రాక్షసి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఈ సినిమా తరువాత ఈ చిన్నది మంచి అవకాశాలనే అందుకుంది. కానీ, స్టార్ హీరోయిన్ గా మాత్రం మారలేకపోయింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమలో పడిపోయి.. ఆ ప్రేమను పెళ్లి వరకు తెచ్చుకుంది. గతనెల వీరి ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగిన విషయం తెల్సిందే. ఎంగేజ్ మెంట్ అయ్యిన దగ్గరనుంచి లావణ్య కాస్తా మెగా కోడలిగా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ ఎక్కడ కనిపించినా అభిమానులు మెగా కోడలు అనే పిలవడం మొదలుపెట్టారు. ఇక ఎంగేజ్ మెంట్ అయ్యాక ఈ చిన్నది సినిమాలకు ఫుల్ స్టాప్ పెడుతుంది అని వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని.. లావణ్య ఒక వీడియో ద్వారా చెప్పుకొచ్చింది. డైరెక్టర్స్ లు వచ్చి ఆమెకు కథలు చెప్తూ ఉండడం ఆమెకు ఏవి నచ్చకపోవడం.. చివరికి ఒక వెబ్ సిరీస్ కు ఆమె కమిట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సిరీస్ కు లావణ్య కొద్దిగా బ్రేక్ తీసుకున్నట్లు కనిపిస్తుంది.
OG: వచ్చాడయ్యా.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ను ఢీకొట్టే మొనగాడు
ప్రస్తుతం లావణ్య వెకేషన్ మోడ్ లోకి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. లవ్ సింబల్ ఉన్న ఫ్రేమ్ ముందు కూర్చొని గెలాటో ఐస్ క్రీమ్ తింటున్నట్లు కనిపించింది. చూడడానికి ఆ ఫ్రేమ్ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. వెనుక సముద్రం.. వైలెట్ కలర్ బ్యాక్ గ్రౌండ్ ముందు వైట్ డ్రెస్ లో లావణ్య చిరునవ్వులు చిందిస్తూ ఎంతో అందంగా ఉంది. ఇక ఈ ఫోటోను వరుణ్ తీశాడు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. కానీ, ప్రస్తుతం వరుణ్ గాండీవధారి అర్జున షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీంతో మెగా కోడలు ఒక్కతే వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది అని తెలుస్తోంది. మరి పెళ్లి తరువాత ఈ ముద్దుగుమ్మ ఎలాంటి హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.