ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘోర పరాజయం పాలైంది. 7 వికెట్ల తేడాతో కోల్ కతా గెలుపొందింది. 183 పరుగుల లక్ష్యాన్ని 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే.. ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు హోంగ్రౌండ్ లో ఆడిన ఏ జట్టూ ఓడిపోలేదు. కానీ.. ఈరోజు కేకేఆర్ తో చేతిలో ఓటమి చెందింది.
Read Also: Off The Record : డైలమాలో Amanchi బ్రదర్స్ పొలిటికల్ కెరీర్
కోల్ కతా బ్యాటర్లలో ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (30), సునీల్ నరైన్ (47) దూకుడు ఇన్నింగ్స్ ఆడి శుభారంభాన్ని అందించారు. అంతేకాకుండా.. జట్టు విజయంలో ఈ పరుగులు ఎంతో ముఖ్యమైనవి. ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్ (50) అర్ధసెంచరీతో జట్టుకు మరింత బలాన్ని చేకూర్చాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (39) కూడా రాణించాడు. ఆ తర్వాత రింకూసింగ్ (5) పరుగులు చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో యష్ దయాల్, మయాంక్ దగర్, విజయ్ కుమార్ వైశ్యక్ తలో వికెట్ సాధించారు. కేకేఆర్ బ్యాటర్ల ముందు ఆర్సీబీ బౌలర్లు చేతులెత్తేశారు.
Read Also: Jharkhand: జంషెడ్‌పూర్ టైర్ల గోదాంలో భారీ అగ్నిప్రమాదం
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటింగ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో కూడా రాణించాడు. 59 బంతుల్లో 83 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. కోహ్లీ ఇన్నింగ్స్ లో 4 సిక్స్ లు, 4 ఫోర్లు ఉన్నాయి. డుప్లెసిస్ (8), గ్రీన్ (33), మ్యాక్స్ వెల్ (28) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ఆ తర్వాత రజత్ పాటిదర్ (3), అనుజ్ రావత్ (3) పరుగులు చేశారు. దినేష్ కార్తీక్ (20) పరుగులు చేశాడు. ఇక.. కేకేఆర్ బౌలింగ్ లో హర్షిత్ రాణా, రస్సెల్ తలో 2 వికెట్లు పడగొట్టారు. సునీల్ నరైన్ ఒక వికెట్ తీశాడు.