Virat Kohli Creates History in IPL: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో విజయాలు సాధించిన మ్యాచ్‌ల్లో 4000 పరుగులు సాధించిన ఏకైక ప్లేయర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్‌లో విజయాల్లో విరాట్ 4039 పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు. శిఖర్ ధావన్ (3945), రోహిత్ శర్మ (3918), డేవిడ్ వార్నర్ (3710), సురేశ్ రైనా (3559)లు విరాట్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లీ చెలరేగాడు. సిక్సర్‌తో పరుగుల ఖాతా తెరిచిన కోహ్లీ.. బౌండరీల వర్షం కురిపించాడు. 27 బంతుల్లో 4 సిక్సర్‌లు, 2 ఫోర్లతో 42 రన్స్ చేశాడు. హాఫ్ సెంచరీ చేస్తాడనుకున్నా.. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచులో బెంగళూరు అద్భుత విజయం సాధించింది.
Also Read: Britney Spears Divorce: మూడోసారి విడాకులు తీసుకున్న స్టార్ సింగర్!
ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. షారుక్ ఖాన్ (37; 24 బంతుల్లో 5×4, 1×6), రాహుల్ తెవాతియా (35; 21 బంతుల్లో 5×4, 2×6)లు రాణించారు. యశ్ దయాల్ (2/21), విజయ్ వైశాక్ (2/23), మహ్మద్ సిరాజ్ (2/29) తలో రెండు వికెట్స్ తీశారు. అనంతరం బెంగళూరు 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫాఫ్ డుప్లెసిస్ (64; 23 బంతుల్లో 10×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.