Preity Zinta: ‘సర్పంచ్ సాబ్’ సూపర్.. నీకంటే లేరెవరూ తోపు.. ప్రీతి జింటా ఆనందోత్సవం!
- అపజయమే లేని జట్టుగా పంజాబ్ కింగ్స్
- 5 మ్యాచ్‌లు ఆడగా.. నాలుగు విజయాలు
- పీబీకేఎస్ యజమాని ప్రీతి జింటా ఆనందోత్సవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) అద్భుత ప్రదర్శనతో దూసుకెళుతోంది. ఇప్పటివరకు అపజయమే లేని జట్టుగా నిలిచింది. పీబీకేఎస్ 5 మ్యాచ్‌లు ఆడగా.. నాలుగు విజయాలు అందుకుంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైయింది. ముంబై ఇండియన్స్ (ఎంఐ)పై అద్భుత విజయం అందుకుని.. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. వరుస విజయాల నేపథ్యంలో పీబీకేఎస్ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముంబైపై ఘన విజయం సాధించిన అనంతరం ‘సర్పంచ్ సాబ్’ సూపర్ అంటూ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు.
పంజాబ్ కింగ్స్ జట్టులోని యువ ఆటగాళ్లను ప్రీతి జింటా ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఆటతీరుకు ఫిదా అయ్యారు. అతను చూపిస్తున్న మెచ్యూరిటీ జట్టుకు ఎంతో ఉపయోగపడుతోందని అభినందించారు. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. ‘మీ ఆట చూస్తే ఎంతో ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు. ‘సడ్డా సర్పంచ్’ అంటూ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నాయకత్వాన్ని ప్రశంసించారు. శ్రేయాస్ నాయకత్వంలో జట్టు అద్భుతంగా రాణిస్తోందని, కోచ్ రికీ పాంటింగ్ మార్గదర్శకత్వం జట్టుకు కీలకమని ప్రీతి జింటా రాసుకొచ్చారు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Jasprit Bumrah Wicketless: బుమ్రా మెరుపుల్లేవ్.. వరుసగా ఐదో మ్యాచ్, నో వికెట్.. ఇక కష్టమేనా!
మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ పట్టిన అద్భుత క్యాచ్‌పై ప్రీతి జింటా ప్రత్యేకంగా స్పందించారు. ‘నేను చూసిన బెస్ట్ క్యాచ్‌లలో ఒకటి’ అంటూ ప్రశంసించారు. శ్రేయాస్.. నీకంటే లేరెవరూ తోపు అంటూ మెచ్చుకున్నారు. జట్టు ప్రదర్శన చూసి తాను చాలా ఆనందంగా ఉన్నానని, చిరునవ్వు ఆగడం లేదని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. పీబీకేఎస్ సమిష్టి ప్రదర్శన, యువ ఆటగాళ్ల మెరుపులు, కెప్టెన్-కోచ్ సమన్వయం జట్టును ఈ సీజన్‌లో అగ్రస్థానంలో నిలబెడుతున్నాయి. అభిమానుల మద్దతుతో పంజాబ్ టైటిల్ రేసులో ముందుంది. మిగిలిన 9 మ్యాచులలో 3 విజయాలు అందుకుంటే.. పీబీకేఎస్ ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!