Ajith Kumar: ‘డేర్‌డెవిల్’గా దూసుకొస్తున్న అజిత్.. మళ్లీ అధిక్ రవిచంద్రన్‌తో చేతులు కలిపిన స్టార్ హీరో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajith Kumar: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ చివరగా థియేటర్లలో ‘గుడ్ బాడ్ అగ్లీ’ (Good Bad Ugly) తో హిట్ కొట్టారు. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2025, ఏప్రిల్ 10న విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లతో భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అజిత్ తన 64వ చిత్రంతో మరో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ‘డేర్‌డెవిల్’ (Dare Devil) అనే పవర్ఫుల్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో హిట్ కాంబినేషన్‌గా నిలిచిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో అజిత్ మరోసారి చేతులు కలపడం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచుతోంది. చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసిన ఆఫీషియల్ అనౌన్స్మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోస్టర్‌పై కనిపించిన ‘Face the Fear’ అనే ట్యాగ్‌లైన్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్నట్లు పోస్టర్ ను చూస్తేనే తెలుస్తోంది. అయితే కథ, పాత్రల నేపథ్యానికి సంబంధించిన వివరాలను చిత్ర బృందం ఇంకా గోప్యంగానే ఉంచింది.
ఈ ప్రాజెక్ట్ కు సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందించనున్నారు. అజిత్ స్టైల్‌కు అనిరుధ్ సంగీతం జతకావడం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. గతంలో వీరి కాంబినేషన్‌కు వచ్చిన ఆదరణ దృష్ట్యా, ఈ సినిమాకు కూడా మ్యూజిక్ హైలెట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని అజిత్ సతీమణి శాలిని అజిత్ కుమార్ తన కొత్త నిర్మాణ సంస్థ ‘బ్రేవ్ హార్ట్ ప్రొడక్షన్’ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ నిర్మాణ సంస్థ ద్వారా శాలిని ‘డేర్‌డెవిల్’తో కీలక అడుగు వేస్తున్నారు. కుటుంబ నిర్మాణ సంస్థలో అజిత్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. అజిత్, అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్లో వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మంచి విజయాన్ని అందుకుంది. అదే విజయాన్ని కొనసాగించేలా ‘డేర్‌డెవిల్’ను మరింత భారీ స్థాయిలో రూపొందించేందుకు దర్శకుడు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసినట్లు సమాచారం.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ప్రస్తుతం నటీనటుల ఎంపికపై చిత్ర బృందం దృష్టి పెట్టింది. కీలక పాత్రల కోసం పలువురు ప్రముఖ నటులతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలో పూర్తి తారాగణాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుండగా, ఈ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. కథ, పాత్రలు, యాక్షన్ ఎపిసోడ్లు, అనిరుధ్ సంగీతం, అధిక్ రవిచంద్రన్ టేకింగ్ కలిసి ‘డేర్‌డెవిల్’ను మరో భారీ కమర్షియల్ ఎంటర్టైనర్గా నిలబెడతాయా అన్న ఆసక్తి కూడా ఇప్పుడు అజిత్ అభిమానుల్లో కనిపిస్తోంది.
Fanmade Poster ❤️🔥
#DareDevil #Ajithkumar pic.twitter.com/v2quJzTsQG
— Ajith Kumar (@ThalaFansClub) August 3, 2026
- Tags
- Ajith Kumar
- cinema
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?