Jasprit Bumrah Wicketless: బుమ్రా మెరుపుల్లేవ్.. వరుసగా ఐదో మ్యాచ్, నో వికెట్.. ఇక కష్టమేనా!
- ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న జస్ప్రీత్ బుమ్రా
- ఐపీఎల్ 2026లో బుమ్రా మెరుపుల్లేవ్
- ఆడిన ఐదు మ్యాచ్‌లలో నో వికెట్
- ఇక ముంబైకి ప్లే ఆఫ్ కష్టమేనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jasprit Bumrah Wicketless in IPL 2026: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ప్రపంచ అత్యుత్తమ బౌలరైన బుమ్రా ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాదు పరుగులు కట్టడి చేయడంలోనూ తన ప్రత్యేకతను చాటుకోలేకపోతున్నాడు. గురువారం వాంఖెడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీగా రన్స్ ఇచ్చుకున్నాడు. 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి.. వికెట్ పడగొట్టలేకపోయాడు. బుమ్రా ఎకానమీ రేట్ 8.63గా ఉండటం ముంబైకి ఆందోళన కలిగిస్తోంది.
ముంబై ఇండియన్స్ తరఫున జస్ప్రీత్ బుమ్రా ఎన్నో ఏళ్లుగా ఉత్తమ ప్రదర్శన చేస్తున్నాడు. 2013లో బుమ్రా అరంగేట్రం చేశాడు. ఎంఐ ఐదు సార్లు కప్పు గెలవడంలో అతడి పాత్ర అత్యంత కీలకం. చివరగా 2020లో ముంబై కప్పు గెలిచింది. ఆ తర్వాత ముంబై ఆధిపత్యం పూర్తిగా తగ్గిపోయింది. అయితే బుమ్రా మాత్రం ఎప్పుడూ నిరాశపర్చలేదు. ఐపీఎల్ 2026లో మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. 1-2 మ్యాచ్‌ల్లో వికెట్లు పడలేదంటే ఏదో అనుకోవచ్చు. కానీ వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో వికెటే లేదు. పైగ కోల్‌కతా మ్యాచ్‌లో 35, రాజస్థాన్ మ్యాచ్‌లో 32, బెంగళూరు మ్యాచ్‌లో 35, పంజాబ్ మ్యాచ్‌లో 41 పరుగులు సమర్పించుకున్నాడు. కేవలం ఢిల్లీ మ్యాచ్‌లో మాత్రమే 21 పరుగులు ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేశాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Hardik Pandya vs Bumrah: హార్దిక్-బుమ్రా మధ్య వాగ్వాదం.. ముంబై ఇండియన్స్‌లో అంతా బాగానే ఉందా?
కుర్రాడు వైభవ్ సూర్యవంశీ కూడా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరికొందరు బ్యాటర్లు కూడా అలవోకగా ఎదుర్కొన్నారు. బుమ్రా వైఫల్యం ముంబై ఇండియన్స్ జట్టుపై గట్టి ప్రభావమే చూపుతోంది. ఎప్పుడూ లేని విధంగా టోర్నీని విజయంతో ఆరంభించిన ముంబై.. తర్వాత వరుసగా నాలుగు ఓటములు చవిచూసింది. బుమ్రా మాత్రమే కాదు.. ముంబై జట్టులో ఏ బౌలరూ నిలకడగా రాణించట్లేదు. మరోవైపు అప్పుడప్పుడు బ్యాటర్ల మెరుపు ఇన్నింగ్స్‌లు తప్పితే.. నిలకడగా రాణించిన సందర్భాలు తక్కువ. ఇప్పటికైనా బూమ్ బూమ్ బుమ్రా సహా బ్యాటర్లు రాణించకపోతే.. ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు వదులుకోవాల్సిందే.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!