RCB Opener Virat Kohli Hit 1000 Runs against PBKS: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు జట్లపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (92; 47 బంతుల్లో 7×4, 6×6) హాఫ్ సెంచరీ చేయడంతో ఈ రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై విరాట్ 1000 పరుగులు మైలు రాయిని అందుకున్నాడు.
ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ 600 పరుగుల మార్కును అందుకున్నాడు. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 634 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 600 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. దాంతో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రికార్డును సమం చేశాడు. విరాట్ 4 సీజన్‌లలో 600 ప్లస్ పరుగులు చేశాడు. రాహుల్ కూడా 4 సీజన్‌లలో 600 పైగా రన్స్ చేశాడు.
Aslo Read: Akshaya Tritiya 2024: నేడు అక్షయ తృతీయ.. ఈ ‘కనకధారా స్తోత్రం’ వింటే కోటీశ్వరులు అవుతారు!
ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్‌సీబీ 60 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 241 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీతో పాటు రజత్ పటీదార్ (55; 23 బంతుల్లో 3×4, 6×6), కామెరూన్ గ్రీన్ (46; 27 బంతుల్లో 5×4, 1×6) కూడా మెరిశారు. ఛేదనలో పంజాబ్ 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. రొసో (61; 27 బంతుల్లో 9×4, 3×6) టాప్ స్కోరర్. మొహ్మద్ సిరాజ్ (3/43) మూడు వికెట్స్ తీశాడు.