ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 టైటిల్‌ను గెలుచుకోవడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్రధాన పోటీదారులుగా నిలవొచ్చని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. బలమైన బ్యాటింగ్ విభాగం, తాజా మార్పులతో హైదరాబాద్ జట్టు మరింత శక్తివంతంగా కనిపిస్తోందని అన్నారు. ‘బియాండ్ 23 క్రికెట్’ పాడ్‌కాస్ట్‌లో క్లార్క్ మాట్లాడుతూ.. ఢిల్లీ క్యాపిటల్స్ (DC), పంజాబ్ కింగ్స్ (PBKS) ఈ సీజన్‌లో కూడా తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోవడం కష్టమేనని అన్నారు. ఇందుకు ప్రధాన కారణం.. రెండు ఫ్రాంచైజీలు కోచింగ్ స్టాఫ్, కెప్టెన్సీలో ప్రధాన మార్పులను చేశారని తెలిపారు. ఈ మార్పుల వల్ల జట్లు కొత్త పరిస్థితులకు అలవాటు పడాల్సి ఉండడం, సమన్వయం సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని క్లార్క్ వెల్లడించారు.
Read Also: Off The Record: జిల్లా అధ్యక్షుల నియమాకాలతో కొత్త లొల్లి
టాప్-4 జట్లు:
టాప్-4 జట్లను ఎంచుకోవాల్సి వస్తే.. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్లేఆఫ్స్‌కు చేరుతాయని క్లార్క్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ తరువాత.. లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాజస్థాన్ రాయల్స్ (RR) మిగతా స్థానాల్లో నిలుస్తుందని తెలిపారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పాట్ కమ్మిన్స్ నాయకత్వంలో టైటిల్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్లార్క్ అభిప్రాయపడ్డారు. ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది.. జట్టు సమతూకం కూడా చాలా మెరుగ్గా ఉందని అన్నారు. అందుకే తాను ఐపీఎల్ 2025 విజేతగా సన్ రైజర్స్‌ని ఎంచుకుంటున్నానని చెప్పారు.
ఐపీఎల్ 2025 ఆరెంజ్ & పర్పుల్ క్యాప్ గెలుచుకొనే ఆటగాళ్లు:
ఇకపోతే, ఐపీఎల్ 2025లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ ట్రావిస్ హెడ్ గెలుచుకుంటారని క్లార్క్ అన్నారు. గత సీజన్‌లో ట్రావిస్ హెడ్ 15 మ్యాచ్‌ల్లో 191.55 స్ట్రైక్ రేట్‌తో 567 పరుగులు చేయడం గమనార్హం. అదే విధంగా.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు ఇచ్చే పర్పుల్ క్యాప్ కుల్దీప్ యాదవ్ గెలుచుకుంటారని ఆయన అంచనా వేశారు. ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు ఈ జట్ల ప్రదర్శనలపై విస్తృతంగా చర్చిస్తున్నారు. సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్, కేకేఆర్, రాజస్థాన్ సత్తా చాటే అవకాశాలు ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ కొన్ని సవాళ్లను ఎదుర్కొనవలసి రావొచ్చని క్లార్క్ అభిప్రాయపడ్డారు.