ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ స్కిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సర్జరీలు చేయించుకున్న క్లార్క్.. తాజాగా మరో స్కిన్ క్యాన్సర్ సర్జరీని చేయించుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. ఆస్ట్రేలియాలో స్కిన్ క్యాన్సర్ సహజమే అని, తాజాగా తాను మరో సర్జరీ చేసుకున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. క్లార్క్ ఇప్పటివరకు డజన్‌కు పైగా చికిత్సలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఆస్ట్రేలియాలో స్కిన్ క్యాన్సర్ చాలా సహజం. నా ముక్కుపై మరో…
Michael Clarke: ఐపీఎల్ 2025 జూన్ 3న ముగిసింది. గ్రాండ్ ఫినాలేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. రజత్ పటీదార్ నేతృత్వంలోని ఆర్సీబీ ఈ సీజన్ మొత్తంలో అద్భుత ప్రదర్శన ఇచ్చింది. ఫైనల్లోనూ అదే ఫార్మ్‌ను కొనసాగించి 18 ఏళ్ల కళను నెరవేర్చుకుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్, కోహ్లీ తదుపరి ఐపీఎల్ సీజన్‌లోనూ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 టైటిల్‌ను గెలుచుకోవడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్రధాన పోటీదారులుగా నిలవొచ్చని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. జట్టుకు ఉన్న బలమైన బ్యాటింగ్ విభాగం, తాజా మార్పులతో హైదరాబాద్ జట్టు మరింత శక్తివంతంగా కనిపిస్తోందని అన్నారు.
Champions Trophy 2025: ప్రస్తుతం పాకిస్తాన్‌లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మెగా టోర్నమెంట్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే జట్లు తలపడనున్నాయి. క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ టోర్నీపై ఇప్పటికే అనేక అంచనాలు మొదలయ్యాయి. తాజాగా, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌లో తలపడతాయని.. ఈసారి భారత్ విజేతగా నిలుస్తుందని పేర్కొన్నాడు. అదికూడా, భారత్ కేవలం ఒక్క పరుగు…
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ఐదు టెస్ట్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 జరుగుతోంది. పెర్త్ టెస్టులో 295 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించగా.. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్స్ తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో మూడో టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఇరు జట్లలో బెస్ట్ ప్లేయర్లతో అత్యుత్తమ జట్టును…
ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ జోస్యం చెప్పాడు. క్లార్క్ తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌లో పాల్గొనగా.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టాప్ స్కోరర్ ఎవరన్న ప్రశ్నకు విరాట్ పేరు చెప్పాడు. ‘పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియా ఓడిపోయిన విషయం పక్కన పెడితే.. కోహ్లీ మొదటి గేమ్‌లో సెంచరీ చేయడం నన్ను చాలా భయపెడుతోంది. ఈ సిరీస్‌లో విరాట్ భారీగా పరుగులు చేస్తాడు.…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భారత్ శుభారంభం చేసింది. బౌలర్లతో పాటు బ్యాటర్లు విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ సెంచరీలతో చెలరేగారు. సుదీర్ఘ టెస్ట్ సిరీస్‌లో విరాట్ మొదటి టెస్టులోనే ఫామ్ అందుకోవడంతో.. టీమిండియా ఫాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ తమ జట్టు వ్యూహాలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. విరాట్ పెర్త్ టెస్ట్ ముందు వరకు పెద్దగా రన్స్ చేయలేదని, అతడిపై మరింత ఒత్తిడి తీసుకొచ్చి కట్టడి చేసేందుకు ఆసీస్…
Steve Smith can break Brian Lara’s 400 record says Michael Clarke: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టు అనంతరం తన 13 ఏళ్ల కెరీర్‌కు వార్నర్ ఎండ్ కార్డు వేశాడు. దీంతో టెస్టుల్లో వార్నర్ వారుసుడు ఎవరు? అని క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. మార్కస్ హారిస్, మాట్ రెన్‌షా, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ ఓపెనర్ రేసులో ఉన్నారు.…
Michael Clarke wants Want Virat Kohli To Score A Duck: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు తమ తొలి మ్యాచ్ ఆడుతున్నాయి. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగియగా.. ప్రస్తుతం భారత్ ఛేజింగ్ చేస్తోంది. టీమిండియా ఆరంభంలోనే మూడు వికెట్స్ కోల్పోగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కేఎల్ రాహుల్ అతడికి అండగా క్రీజులో ఉన్నాడు. భారత్ ఈ ఇద్దరిపైనే ఆశలు పెట్టుకుంది.…