Adah Sharma : ఇప్పుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందనేది మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లతోనే తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రతి సినిమాకు కలెక్షన్ల లెక్కేల ముఖ్యం అన్నట్టు ట్రెండ్ మారిపోయింది. ఎంత పెద్ద నెంబర్ వస్తే అంత పెద్ద హిట్ అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. అయితే తాజాగా ఆదా శర్మ ఈ బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఆమె ది కేరళ స్టోరీ సినిమాతో ఎంతో పెద్ద హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.360 కోట్లు సాధించింది. కానీ తర్వాత బస్తర్ః ది నక్సల్ స్టోరీ మాత్రం ప్లాప్ అయింది. ఈ ఫెయిల్యూర్ గురించి ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
Read Also : Rithu Chowdari : చీరకట్టులో సొగసులు చూపిస్తున్న రీతూ చౌదరి
‘నేను ఎప్పుడూ బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి ఆలోచించలేదు. ఎందుకంటే మంచి సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నామా లేదా అనేది మాత్రమే ఆలోచిస్తాను. అసలు బాక్సాఫీస్ కలెక్షన్ల గోల అవసరమా అనిపిస్తుంది. ది బస్తర్ మూవీ మంచి కంటెంట్ ఉన్న సినిమా. అందులో నా పాత్ర బాగుందా లేదా అనేది మాత్రమే నేను ఆలోచించాను. కేరళ స్టోరీ తీసినప్పుడు కూడా అంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. కథను నమ్మి చేశాను’ అంటూ చెప్పుకొచ్చింది ఆదాశర్మ. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె టాలీవుడ్ లో నటించి చాలా రోజులు అవుతోంది. త్వరలోనే నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.