Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Jasprit Bumrah Players With Most Sixes Against Him In Ipl Ab De Villiers Tops The List

Jasprit Bumrah Sixes: బుమ్రా బౌలింగ్‌లో అత్యధిక సిక్సులు బాదింది ఎవరో తెలుసా?.. అగ్రస్థానంలో ఆ ఇద్దరు దిగ్గజాలు!

Published Date :April 8, 2026 , 9:14 pm
By Sampath Kumar
  • ఏ బ్యాటర్‌కు అయినా బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొవడం కష్టం
  • బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టడం అంత ఈజీ కాదు
  • బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్లు బాదిన బ్యాటర్లు వీరే
Jasprit Bumrah Sixes: బుమ్రా బౌలింగ్‌లో అత్యధిక సిక్సులు బాదింది ఎవరో తెలుసా?.. అగ్రస్థానంలో ఆ ఇద్దరు దిగ్గజాలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రపంచ నంబర్ వన్ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొవడం ఏ బ్యాటర్‌కు అయినా చాలా కష్టం. యార్కర్లు, స్లో బంతులు, కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంటాడు. బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టడం అంత ఈజీ కాదు. కొంతమంది బ్యాటర్లు అతడి బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొని సిక్సర్లు బాదారు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ.. బుమ్రా బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో బుమ్రా బౌలింగ్‌లో అత్యధిక సిక్సులు బాదిన బ్యాటర్ల లిస్ట్ ఓసారి చూద్దాం.

ఐపీఎల్‌లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. బుమ్రా బౌలింగ్‌లో ఏకంగా 8 సిక్సర్లు బాది.. తన దూకుడు బ్యాటింగ్‌ను ప్రపంచానికి చూపించాడు. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా క్రికెటర్ జేపీ డుమిని తలా 6 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నారు. ముంబై ఇండియన్స్ మాజీ స్టార్ కీరన్ పోలార్డ్ 5 సిక్సర్లు బాదగా.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ పాట్ కమిన్స్, కోల్‌కతా స్టార్ ఆండ్రీ రస్సెల్ తలా 4 సిక్సర్లు కొట్టారు. అలాగే దినేష్ కార్తిక్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్ తలా 3 సిక్సర్లు బాదారు.

ఈ జాబితాలో తాజాగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా చేరడం విశేషం. అతడు బూమ్ బూమ్ బుమ్రా బౌలింగ్‌లో 2 సిక్సర్లు బాదాడు. 15 ఏళ్ల వయసులోనే వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్‌ను టార్గెట్ చేసి సిక్సర్లు కొట్టడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్లు బాదడం అంటే బ్యాటర్‌కు నైపుణ్యం, ధైర్యం రెండూ ఉండాలి. ఈ రెండు యువ సంచనలం సూర్యవంశీలో మెండుగా ఉన్నాయి. ఈ లిస్టులో ఉన్న ఆటగాళ్లు అందరూ అంతర్జాతీయ క్రికెటర్లు కాగా.. వైభవ్ మాత్రం ఇంకా అరంగేట్రం చేయలేదు. వైభవ్ తన సిక్సుల రికార్డును మెరుగుపర్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AB de Villiers
  • IPL 2026
  • Jasprit Bumrah
  • Jasprit Bumrah IPL stats
  • Jasprit Bumrah Sixes

తాజావార్తలు

  • Jasprit Bumrah Sixes: బుమ్రా బౌలింగ్‌లో అత్యధిక సిక్సులు బాదింది ఎవరో తెలుసా?.. అగ్రస్థానంలో ఆ ఇద్దరు దిగ్గజాలు!

  • Pawan : పవన్‌కల్యాణ్‌ను వెంటాడిన సెంటిమెంట్?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Amla Murabba: తెల్ల జుట్టుకు చెక్.. మెరిసే చర్మానికి కేరాఫ్ అడ్రస్.. అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ ఇదే!

  • INCA: ఐఎన్సీఏ అవార్డ్స్..ఉత్తమ నటుడుగా నాగ చైతన్య!

ట్రెండింగ్‌

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions