Yashasvi Jaiswal: “నేనూ చిన్నవాడినే, కానీ అతడితో పోలిస్తే..” వైభవ్‌పై జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashasvi Jaiswal: ఐపీఎల్‌లో రాజస్థాన్ యువ బ్యాటర్ వైభవ్ సూర్య వంశీ సంచలనం సృష్టిస్తున్నాడు. నిన్న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతుల్లోనే 43 పరుగులు సాధించి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. ఈ ఎన్నింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ స్పందించాడు. తన తోటి ఓపెనర్, 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన భారీ లక్ష్య ఛేదనలో వీరిద్దరి భాగస్వామ్యంపై జైస్వాల్ తన అనుభవాలను పంచుకున్నాడు. సూర్యవంశీ బ్యాటింగ్ గురించి చెబుతూ.. “వైభవ్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా అద్భుతంగా ఉంది. అతను బంతిని హిట్ చేస్తున్న తీరు చూస్తుంటే నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజానికి నేను కూడా చాలా చిన్నవాడినే, కానీ అతనితో పోలిస్తే నేను పెద్దవాడిని అంటే ఏమని చెప్పాలో అర్థం కావడం లేదు. అతనిలో ఉన్న ప్రతిభ అసాధారణం” అని జైస్వాల్ అన్నాడు.
భారీ లక్ష్య ఛేదన కోసం తమ ప్రణాళికను వివరిస్తూ.. “ఇది హై-స్కోరింగ్ గ్రౌండ్ అని మాకు తెలుసు. అందుకే ఆరంభం నుండే దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాం. బంతులను అస్సలు వదలకూడదనే స్పష్టమైన ఆలోచనతో బరిలోకి దిగాం. 200 పైచిలుకు పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు ఆ ‘ఇంటెంట్’ చాలా ముఖ్యం” అని పేర్కొన్నాడు. జట్టులోని మార్పులు, వాతావరణం గురించి స్పందించాడు. అందరూ ప్రతి మ్యాచ్‌లో రాణించాలేరని తెలిపాడు. కానీ తమ జట్టులో ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉందని చెప్పాడు. తామంతా ప్రాసెస్‌పైనే దృష్టి పెడుతున్నామని.. సరైన సమయంలో ఫలితాలు వస్తాయని తమకు తెలుసని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం చాలా సరదాగా ఉందని.. మేమంతా కలిసి ఈ ఆటను ఆస్వాదిస్తున్నామన్నాడు. ఒకరికొకరు అండగా నిలుస్తూ, స్వేచ్ఛగా ఆడటమే తమ జట్టు విజయరహస్యమని వివరించాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!