Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Riyan Parag Reaction After Rajasthan Royals Win Vs Punjab Kings Ipl 2026

Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Published Date :April 29, 2026 , 9:30 am
By RAMAKRISHNA KENCHE
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Riyan Parag: నిన్న (మంగళవారం) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పంజాబ్ కింగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి నాలుగు బంతులు మిగిలి ఉండగానే 223 లక్ష్యాన్ని ఛేదించింది రాజస్థాన్. న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఇక పంజాబ్ కింగ్స్‌పై సాధించిన భారీ విజయం అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తన జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. టోర్నీ ప్రారంభానికి ముందే తాము ఆటను కేవలం ఒక ఆటలాగే చూడాలని నిర్ణయించుకున్నామని, గెలిచినా ఓడినా అందులోని తప్పొప్పులను సమీక్షించుకుని ముందుకు సాగడమే తమ పని అని పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్ ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. “ఇది దాదాపు మా అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పవచ్చు. బౌలింగ్‌లో వారిని ఇంకాస్త తక్కువ స్కోరుకే పరిమితం చేయాల్సి ఉండేది. అలాగే మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. ఒక మ్యాచ్‌లో మొత్తం 40 ఓవర్ల పాటు ఖచ్చితత్వంతో ఆడటం అసాధ్యం, కానీ ఆ దిశగా ప్రయత్నించడమే మా లక్ష్యం. ఇక, మిడిల్ ఆర్డర్ గురించి ఆందోళనలు కేవలం బయట వ్యక్తులకు, వ్యాఖ్యాతలకు మాత్రమే ఉన్నాయి. మాకు కాదు. మా ఆటగాళ్ల సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎప్పుడైనా మిడిల్ ఆర్డర్ విఫలమైతే ఓపెనర్లు లేదా లోయర్ ఆర్డర్ బాధ్యత తీసుకుంటారు. అలాగే టాప్ ఆర్డర్ ఆడనప్పుడు మిడిల్ ఆర్డర్ ఆదుకుంటుంది. బయట జరిగే చర్చలను మేం పట్టించుకోం” అని స్పష్టం చేశాడు. లక్ష్య ఛేదనలో తమ వ్యూహాన్ని వివరిస్తూ.. “వికెట్లు చేజార్చుకోకుండానే రన్ రేట్ తగ్గకుండా చూడాలనుకున్నాం. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ఇచ్చిన ఆరంభం మా పనిని చాలా సులభం చేసింది. పవర్‌ప్లే తర్వాత రన్ రేట్ కాస్త తగ్గినప్పటికీ, చివర్లో శుభమ్ దూబే, డోనోవన్ ఫెరీరా అద్భుతమైన భాగస్వామ్యంతో మ్యాచ్‌ను పంజాబ్ నుంచి లాగేసుకున్నారు. వారిద్దరూ ఆడిన తీరు నిజంగా ప్రశంసనీయం” అని కెప్టెన్ కొనియాడాడు.

Also Read

  • Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కెప్టెన్..
  • Shreyas Iyer: "222 కొట్టినా ఓడామంటే బాధగా ఉంది".. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
  • Yashasvi Jaiswal: "నేనూ చిన్నవాడినే, కానీ అతడితో పోలిస్తే.." వైభవ్‌పై జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
  • Marcus Stoinis: 4, 6, 6, 4, 4.. స్టోయినిస్ డెత్ ఓవర్ బీభత్సం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cricket news
  • IPL 2026
  • Punjab Kings loss
  • rajasthan royals
  • Rajasthan Royals Win

తాజావార్తలు

  • Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్‌లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు

  • Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

  • Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్‌తో మనం పోల్చుకోలేము

  • Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions