I Am Game: జియోహాట్‌స్టార్‌లోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
I Am Game: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన భారీ ఫాంటసీ యాక్షన్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ ఎట్టకేలకు ఓటీటీ బాట పట్టింది. థియేటర్లలో రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్‌లో నవంబర్ 6 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. కేవలం మలయాళానికే పరిమితం కాకుండా.. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా లెవల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
‘ఆర్డీఎక్స్’ ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రూ. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న థియేటర్లలోకి వచ్చింది. ఇందులో ‘డాన్ జాన్’ పాత్రలో దుల్కర్ సల్మాన్ యాక్టింగ్, భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను బాగానే మెప్పించాయి. ప్రముఖ దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాతోనే మలయాళంలో నటుడిగా ఎంట్రీ ఇవ్వగా, ఆంటోనీ వర్గీస్ మరో కీలక పాత్రలో కనిపించారు. అయితే స్క్రీన్‌ప్లేలో కాస్త పట్టు తప్పడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. థియేటర్లలో ఫలితం తేడా కొట్టినా, డిజిటల్ రైట్స్ పరంగా మాత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. మలయాళ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ మొత్తానికి దీని ఓటీటీ రైట్స్ అమ్ముడైనట్లు సమాచారం. దీంతో ఈ డీల్ మాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నవంబర్ 6 నుంచి తెలుగుతో పాటు ఐదు భాషల్లో అందుబాటులోకి వస్తుండటంతో, థియేటర్లలో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను చూడలేకపోయిన సినిమా లవర్స్ ఓటీటీలో చూసేందుకు రెడీ అవుతున్నారు.
Also Read
- Dorothy : డొరొతీ ఒరిజినల్ క్లైమాక్స్ ఇదే.. లీక్ చేసిన కార్తీక్ సుబ్బరాజు
- Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
- Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
- Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
ఐయామ్ గేమ్ కథ:
డేన్ జాన్ (దుల్కర్ సల్మాన్) విపరీతమైన గాంబ్లింగ్ వ్యసనం ఉన్న యువకుడు. బెట్టింగ్ వల్ల అప్పులపాలై దెబ్బలు తింటున్న కొడుకుని చూసి తట్టుకోలేక, తల్లి మెర్సీ (జయసుధ) తన కష్టార్జితం 60 లక్షల రూపాయలను అతడికి ఇస్తుంది. అయితే ఆ డబ్బును కూడా జాన్ క్రికెట్ బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత ఆవేశంలో నిర్వాహకులను బెదిరించి ఆ డబ్బు తీసుకుని కారులో పారిపోతూ ఘోర ప్రమాదానికి గురవుతాడు. ఈ ప్రమాదంలో జాన్ తన కుడి చేతిని కోల్పోవడంతో పాటు కోమాలోకి వెళ్తాడు. ప్రాణాలు దక్కించుకున్న అతడికి వైద్యులు మరొక వ్యక్తి చేతిని అమర్చుతారు. అదే సమయంలో ఫిజియోథెరపిస్ట్ ఇషా (కాయదు లోహర్)తో అతనికి పరిచయం ఏర్పడుతుంది. అప్పటినుంచి అతనికి అమర్చిన కొత్త చేయి జాన్ నియంత్రణ తప్పి తన ఇష్టానుసారం ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఒక రోజు బెట్టింగ్ సెంటర్లో ఉన్న జాన్ వద్దకు డేవిడ్ (మిస్కిన్) రాగానే, ఆ చేయి కత్తి పట్టుకుని అతనిపై తీవ్రమైన కోపంతో దాడికి దిగుతుంది. ఆ చేయి ఎవరిది? డేవిడ్ ను అది ఎందుకు చంపాలనుకుంది? అనేదే ఈ సినిమా కథ.
The game is about to begin!
Dulquer Salmaan’s I’m Game streaming from November 6 on JioHotstar in Malayalam, Hindi, Tamil, Telugu & Kannada.
@dulQuer @NAHASKh1 @11Lohar @DQsWayfarerFilm
#ImGame #ImGameOnJioHotstar #DQ #JioHotstar https://t.co/BYLt5OHqU9
— JioHotstar Malayalam (@JioHotstarMal) October 31, 2026
తాజావార్తలు
-
I Am Game: జియోహాట్‌స్టార్‌లోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
-
Bima Sakhi: 10th పాసైన మహిళలకు నెలకు రూ.7,000.. LIC బంపరాఫర్! పూర్తి వివరాలు ఇవే..
-
Nvidia: చైనాకు AI చిప్స్ అక్రమ రవాణా.? ఎన్విడియా సీఈఓ సన్నిహితురాలిపై అనుమానం..
-
Dorothy : డొరొతీ ఒరిజినల్ క్లైమాక్స్ ఇదే.. లీక్ చేసిన కార్తీక్ సుబ్బరాజు
-
Jio Voice Only Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.147 నుంచే వాయిస్ ఓన్లీ ప్లాన్స్! వ్యాలిడిటీ వివరాలివే!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!