Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Riyan Parag: నిన్న (మంగళవారం) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పంజాబ్ కింగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి నాలుగు బంతులు మిగిలి ఉండగానే 223 లక్ష్యాన్ని ఛేదించింది రాజస్థాన్. న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఇక పంజాబ్ కింగ్స్‌పై సాధించిన భారీ విజయం అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తన జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. టోర్నీ ప్రారంభానికి ముందే తాము ఆటను కేవలం ఒక ఆటలాగే చూడాలని నిర్ణయించుకున్నామని, గెలిచినా ఓడినా అందులోని తప్పొప్పులను సమీక్షించుకుని ముందుకు సాగడమే తమ పని అని పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్ ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. “ఇది దాదాపు మా అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పవచ్చు. బౌలింగ్‌లో వారిని ఇంకాస్త తక్కువ స్కోరుకే పరిమితం చేయాల్సి ఉండేది. అలాగే మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. ఒక మ్యాచ్‌లో మొత్తం 40 ఓవర్ల పాటు ఖచ్చితత్వంతో ఆడటం అసాధ్యం, కానీ ఆ దిశగా ప్రయత్నించడమే మా లక్ష్యం. ఇక, మిడిల్ ఆర్డర్ గురించి ఆందోళనలు కేవలం బయట వ్యక్తులకు, వ్యాఖ్యాతలకు మాత్రమే ఉన్నాయి. మాకు కాదు. మా ఆటగాళ్ల సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎప్పుడైనా మిడిల్ ఆర్డర్ విఫలమైతే ఓపెనర్లు లేదా లోయర్ ఆర్డర్ బాధ్యత తీసుకుంటారు. అలాగే టాప్ ఆర్డర్ ఆడనప్పుడు మిడిల్ ఆర్డర్ ఆదుకుంటుంది. బయట జరిగే చర్చలను మేం పట్టించుకోం” అని స్పష్టం చేశాడు. లక్ష్య ఛేదనలో తమ వ్యూహాన్ని వివరిస్తూ.. “వికెట్లు చేజార్చుకోకుండానే రన్ రేట్ తగ్గకుండా చూడాలనుకున్నాం. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ఇచ్చిన ఆరంభం మా పనిని చాలా సులభం చేసింది. పవర్‌ప్లే తర్వాత రన్ రేట్ కాస్త తగ్గినప్పటికీ, చివర్లో శుభమ్ దూబే, డోనోవన్ ఫెరీరా అద్భుతమైన భాగస్వామ్యంతో మ్యాచ్‌ను పంజాబ్ నుంచి లాగేసుకున్నారు. వారిద్దరూ ఆడిన తీరు నిజంగా ప్రశంసనీయం” అని కెప్టెన్ కొనియాడాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!