Hardik Pandya vs Bumrah: హార్దిక్-బుమ్రా మధ్య వాగ్వాదం.. ముంబై ఇండియన్స్‌లో అంతా బాగానే ఉందా?
- వరుస పరాజయాలను ఎదుర్కొంటోన్న ముంబై
- హార్దిక్-బుమ్రా మధ్య వాగ్వాదం
- ఆటగాళ్ల మధ్య అంతా బాగానే ఉందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya vs Jasprit Bumrah Argument: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టు వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఒకటే గెలిచి.. నాలుగు పరాజయాలను చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో విఫలమవుతున్న ముంబై.. పట్టికలో 9వ స్థానంలో ఉంది. వరుస వైఫల్యాల నేపథ్యంలో ముంబై జట్టు, కెప్టెన్ హార్దిక్ పాండ్యపై తీవ్ర విమ్మర్శలు వస్తున్నాయి. ఇది చాలదన్నట్లు ఆటగాళ్ల మధ్య సరైన సఖ్యత లేనట్లు తెలుస్తోంది. తాజాగా ముంబై, పంజాబ్ మ్యాచ్‌లో జరిగిన ఓ ఆసక్తికర ఘటన ఇందుకు మరింత బలమిస్తోంది. ఇది సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
కెప్టెన్ హార్దిక్ పాండ్య, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య ఫీల్డ్ సెట్టింగ్ విషయంలో చిన్న వాగ్వాదం జరిగింది. మ్యాచ్ సందర్భంగా బుమ్రా బౌలింగ్ చేస్తున్న సమయంలో హార్దిక్ ఫీల్డింగ్‌లో మార్పులు చేస్తూ సూచనలు ఇచ్చాడు. అయితే ఆ ఫీల్డ్ సెట్టింగ్ బుమ్రా ప్లాన్‌కు అనుకూలంగా లేదు. దీంతో బుమ్రా ఒక్కసారి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. హార్దిక్‌తో చర్చకు దిగాడు. ఇద్దరి మధ్య కాసేపు సీరియస్ డిస్కషన్ జరిగింది. చివరకు కెప్టెన్ నిర్ణయానికే తలొగ్గిన బుమ్రా.. ఏమీ అందకుండా మళ్లీ బౌలింగ్ చేయడానికి వెళ్లిపోయాడు. అయితే బుమ్రా ముఖంలో నిరాశ మాత్రం స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ముంబై జట్టులో సమన్వయం లోపించిందా?, ముంబైలో అంతా బాగానే ఉందా? అనే సందేహాలు అభిమానుల్లో కలుగుతున్నాయి.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ముంబై ఇండియన్స్ అంటే ఒకప్పుడు అద్భుతమైన టీమ్ స్పిరిట్, స్పష్టమైన ప్లానింగ్, సమన్వయానికి పేరుగాంచిన జట్టు. కానీ ప్రస్తుతం కనిపిస్తున్న ఇలాంటి ఘటనలు జట్టు లోపల ఏదో జరుగుతోందనే సంకేతాలు ఇస్తున్నాయి. వరుస ఓటములతో పాటు ఇలాంటి విభేదాలు జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశముంది. టాప్ స్టార్స్ అయిన హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా మధ్య జరిగిన ఈ సంఘటన ముంబై ఇండియన్స్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. జట్టు త్వరగా సమస్యలను పరిష్కరించుకుని.. మళ్లీ గెలుపు బాట పట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Amaravati Farmers: అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
IND vs SL: తొలి టెస్టు టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్.. సీనియర్‌కు నో ప్లేస్, కొత్త కుర్రాడు అరంగేట్రం!
-
Independence Day 2026: ఇంతకీ ఇది 80వ స్వాతంత్య్ర దినోత్సవమా? లేక 79వదా? ఫుల్ క్లారిటీ ఇదిగో..
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
ట్రెండింగ్
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
-
Hardik Pandya Trade: చెన్నై, కోల్‌కతా కాదు.. హార్దిక్ ఆ జట్టులోకే వెళ్తాడు.. ఏ తప్పేముంది!
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!