Virat Kohli: బాక్స్‌లో కూర్చొని కామెంటరీ చేయడం సులువే.. గవాస్కర్‌కు ఇచ్చిపడేసిన కోహ్లీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli React on IPL 2024 Strike-Rate: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 500 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2024 ‘ఆరెంజ్ క్యాప్’ కోహ్లీ వద్దే ఉంది. బెంగళూరు తరఫున ప్రతి మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడినా.. కోహ్లీ ఆటతీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ ఎడిషన్‌లో తక్కువ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేస్తున్నాడనే విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోహ్లీ 43 బంతుల్లో 51 పరుగులు చేయడాన్ని మాజీలు తప్పుపట్టారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విరాట్ కోహ్లీ కొట్టిన హాఫ్ సెంచరీ ఎంతో విలువైనదే అయినా.. అతడి ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగిందని టీమిండియా మాజీ దిగ్గజం, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. విరాట్ నుంచి జట్టు కోరుకుంటోంది ఇది కాదని, కోహ్లీ పెద్ద షాట్లను ప్రయత్నించాలన్నారు. తనపై వచ్చిన కామెంట్లపై గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం కోహ్లీ తీవ్రంగా స్పందించాడు. స్ట్రైక్‌రేట్ తక్కువగా ఉందని కామెంట్లు చేసేవారికి ఆటపై పెద్దగా అవగాహన ఉండి ఉండదని ఎద్దేవా చేశాడు. బాక్స్‌లో కూర్చొని కామెంటరీ చేయడం సులువే అన్నాడు. బయట కూర్చొని కామెంట్లు చేసే చాలా మందికి మ్యాచ్ పరిస్థితి తెలియదని మండిపడ్డాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: T20 World Cup 2024: న్యూజిలాండ్ ప్రపంచకప్ జట్టు ప్రకటన.. స్టార్లకు దక్కని చోటు!
‘స్పిన్‌ను సరిగ్గా ఆడలేనని, స్ట్రైక్‌రేట్ తక్కువగా ఉందని నాపై కామెంట్లు చేసేవారికి ఆటపై పెద్దగా అవగాహన ఉండి ఉండదు. ప్రతి మ్యాచ్‌లో విజయం కోసమే నేను కష్టపడతా. అందుకే 15 ఏళ్లుగా ఆటలో కొనసాగుతున్నా. మేం ప్రతి రోజూ జట్టు కోసం ఆలోచిస్తాం. బయట కూర్చొని కామెంట్లు చేసే వారికి మ్యాచ్ పరిస్థితి ఏంటో తెలియదు. అభిమానులు మా నుంచి ఇంకా మెరుగైన ప్రదర్శన ఆశిస్తారు. అందులో తప్పేం లేదు కానీ.. మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉందనేది కూడా మాకు చాలా కీలకం. ఉన్నతస్థాయిలో క్రికెట్ ఆడిన వారెవరూ విమర్శలు చేయరు. తెలిసీతెలియని వారే విమర్శలు చేస్తుంటారు. మేం ఆత్మగౌరవంతో మ్యాచ్‌లను ఆడతాం. బయట నుంచి వచ్చే కామెంట్లను నేను పెద్దగా పట్టించుకోను’ అని విరాట్ కోహ్లీ అన్నాడు.
తాజావార్తలు
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!