T20 World Cup 2024: న్యూజిలాండ్ ప్రపంచకప్ జట్టు ప్రకటన.. స్టార్‌లకు దక్కని చోటు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Zealand Squad for T20 World Cup 2024: అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 2 నుంచి ఆరంభం కానుంది. మెగా టోర్నీ కోసం జట్టును ప్రకటించేందుకు మే 1ని ఐసీసీ డెడ్ లైన్‌గా విధించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నేడు (ఏప్రిల్ 29) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. స్టార్లతో నిండిన ఈ జట్టుకు కేన్ విలియమ్సన్ సారథ్యం వహించనున్నాడు. ఫామ్ లేని కొందరి ఆటగాళ్లపై వేటు వేసిన కివీస్ బోర్డు.. గాయపడిన మరికొందరు ప్లేయర్లను పక్కనపెట్టింది.
గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ కైల్ జేమిసన్, ఆల్‌రౌండర్ ఆడమ్ మిల్నేలు టీ20 ప్రపంచకప్ 2024కు దూరమయ్యారు. మిల్నే స్థానంలో మ్యాట్ హెన్రీ చోటు దక్కించుకున్నాడు. ఫామ్‌లో లేని స్టార్ ప్లేయర్స్ టామ్ బ్లండెల్, టామ్ లాథమ్, టిమ్ సీఫెర్ట్‌లు జట్టుకు ఎంపిక కాలేదు. బొటనవేలి గాయంతో బాధపడుతున్న స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వేను సెలెక్టర్లు ఎంపిక చేశారు. వికెట్‌కీపర్ ఫిన్ అలెన్‌కు స్థానం లభించినప్పటికీ.. తుది జట్టులో కాన్వేనే కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
తాజాగా జట్టు సారథ్య బాధ్యతలు మోసిన మైఖేల్ బ్రేస్‌వెల్ టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మార్క్ చాప్‌మన్, జిమ్మీ నీషమ్, డారిల్ మిచెల్ ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఐష్ సోధి, మిచెల్ సాంట్నార్ ఉండగా.. టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, లోకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ పేస్ కోటాలో ఎంపికయ్యారు. మెగా టోర్నీ కోసం న్యూజిలాండ్ మే 23న బయల్దేరనుంది. జూన్ 7న ఆఫ్ఘనిస్తాన్‌తో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది.
న్యూజిలాండ్ జట్టు:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఐష్ సోధీ.
ట్రావెలింగ్ రిజర్వ్-బెన్ సియర్స్
తాజావార్తలు
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!