ODI WC 2023: వన్డే వరల్డ్‌కప్ వేదికలకు కొత్త హంగులు.. హైదరాబాద్ స్టేడియానికి రూ. 117 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ సంవత్సరం అక్టోబర్-నవంబర్ నెలలో జరుగనున్న వన్డే వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. 12 ఏళ్ల తర్వాత టీమిండియాలో జరుగుతనన్ వన్డే వరల్డ్ కప్ కావడంతో బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే టోర్నీ నిర్వహించేందుకు 12 స్టేడియాలను షార్ట్ లిస్ట్ కూడా చేసింది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గువాహటి, కోల్ కతా, లక్నో, ఇండోర్, హైదరాబాద్, ముంబై ఈ లిస్టులో ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని స్టేడియాలలో కనీస సౌకర్యాలు కూడా ఉండటం లేదని అభిమానులు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో మంగళవారం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
Read Also : CM YS Jagan: మహిళా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త..
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
అక్టోబర్-నవంబర్ నెలల్లో జరుగబోయే ఈ మెగా టోర్నీకి ముందే దేశంలోని స్టేడియాలను పూర్తిగా న్యూ లుక్ లో కనిపించేలా కసరత్తులు చేస్తోంది. దీని కోసం రూ. 500 కోట్ల ఖర్చుతో ఐదు స్టేడియాలను రెనోవేట్ చేయనుంది. ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి పేరున్నది. దేశంలోని క్రికెట్ స్టేడియాలు మాత్రం దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వరల్డ్ కప్ కూడా ఇలాంటి స్టేడియాలలో జరిగితే పోయేది బోర్డు పరువే అందుకే.. భారీగా ఖర్చు చేసైనా సరే అర్జెంట్ గా స్టేడియాల రూపురేఖలు మార్చాలని బీసీసీఐ నిర్ణయించింది.
Read Also : Bhatti Vikramarka : విశాఖ వద్దు బయ్యారం ముద్దు..
అయితే ఐదు స్టేడియాల రూపురేఖలు మార్చాలని అనుకున్న స్టేడియాల్లో ఢిల్లీతో పాటు హైదరాబాద్, కోల్ కతా, మొహాలి, ముంబై స్టేడియాల్లో వసతులను మెరుగుపర్చానున్నారు. వన్డే వరల్డ్ కప్ వేదికల్లో ఈసారి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి బీసీసీఐ చోటు కల్పించింది. అయితే స్టేడియంలో వసతులు, సౌకర్యాలు మరి నాసిరకంగా ఉన్నాయని అభిమానుల నుంచి ఫిర్యాదులు అందాయి. తాజాగా ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతన్న నేపథ్యంలో అభిమానుల నుంచి ఈ ఫిర్యాదులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు తీసుకురావడానికి బడ్జెట్ లో నిధులు కేటాయించింది. స్టేడియంలో వసతులు మెరుగుపర్చడానికి రూ. 117.17 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది.
Read Also : Karnataka Elections: బీజేపీకి ఈశ్వరప్ప షాక్.. పోటీ చేయనని నడ్డాకు లేఖ
ఇక హైదరాబాద్ తో పాటు ఢిల్లీ స్టేడియానికి రూ. 100 కోట్లు, కోత్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ కోసం రూ. 127.47 కోట్లు, మొహాలీలోని పీసీఏ స్టేడియానికి రూ. 79.46 కోట్లు, వాంఖడే కోసం రూ. 78.82 కోట్లు ఖర్చు కానుంది. ఒక వేళ ఈ స్టేడియాల్లో రూప్ పనులు కూడా చేస్తే ఈ ఖర్చ మరింత పెరుగనుంది. 2011 వరల్డ్ కప్ ఫైనల్ కు వేదికైన ముంబైలోని వాంఖెడ్ స్టేడియంలో కనీస వసతులు లేవని ఓ అభిమాని ఫిర్యాదు చేయడంతో ఈ మధ్యే ఇండియా-ఆస్ట్రేలియా వన్డేకు ముందు ఆ స్టేడియాన్ని రెనోవేట్ చేశారు. వరల్డ్ కప్ లో భాగంగా మొత్తం 48 మ్యాచ్ లు జరుగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం ఆతిథ్యమిచ్చే అవకాశం ఉందని బీసీసీఐ వెల్లడించింది. ఇక 2011లో భారత్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ను ధోని సేన గెలిచింది. ఫైనల్ లో శ్రీలంకను ఓడించి 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించి రెండోసారి వన్డే ప్రపంచకప్ ను కొట్టింది.
తాజావార్తలు
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
-
Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి