Praful Hinge-Vaibhav: హాట్సాఫ్ ప్రఫుల్ హింగే.. చెప్పినట్టే మొదటి బంతికే ‘బుడ్డోడి’ వికెట్ తీశావ్!
- మొదటి బంతికే సూర్యవంశీని అవుట్ చేసిన హింగే
- హాట్సాఫ్ ప్రఫుల్ హింగే
- సోషల్ మీడియాలో మార్మోగిపోతున్న హింగే పేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత రెండేళ్లుగా భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025, దేశవాళీ టోర్నీలు, అండర్ 19 ప్రపంచకప్ 2026లో బుడ్డోడు వైభవ్ అదరగొట్టాడు. ఎన్నో అంచనాల మధ్య ఐపీఎల్ 2026లో అడుగుపెట్టిన అతడు.. అంతకుమించి ఆడాడు. ఇండియన్ స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్, స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కూడా సునాయాసంగా సిక్సులు బాదాడు. అంతంత మాత్రమే ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్‌పై వైభవ్ ఊచకోత ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. మొదటి బంతికే పెవిలియన్ చేరాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 రన్స్ చేసింది. లక్ష్య ఛేదనలో రాయల్స్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటై 57 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన విదర్భ యువ బౌలర్ ప్రఫుల్ హింగే.. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. హింగే ధాటికి వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, ప్రిటోరియస్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ముఖ్యంగా ఐపీఎల్ 2026లో టాప్ బౌలర్లనే ఓ ఆటాడుకుంటున్న వైభవ్.. మొదటి బంతికే డకౌట్ అందరినీ విస్మయానికి గురిచేసింది.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
Also Read: Praful Hinge: 4 వికెట్స్ తీస్తానని ముందే రాసిపెట్టుకున్నా.. నేను మానిఫెస్టేషన్‌ను నమ్ముతా!
వైభవ్ సూర్యవంశీని మొదటి బంతికే అవుట్ చేస్తానని చెప్పిన ప్రఫుల్ హింగే.. చెప్పినట్లే అవుట్ చేశాడు. మ్యాచ్‌లో తనకు అత్యంత ఇష్టమైన వికెట్ గురించి మాట్లాడుతూ.. ఫామ్‌లో ఉన్న సూర్యవంశీని తొలి బంతికే ఔట్ చేయడం ప్రత్యేకంగా అనిపించిందని చెప్పాడు. ఆ వికెట్ కోసం ముందే ప్రణాళిక వేసుకున్నానని, బౌన్సర్‌తో అయినా ఔట్ చేస్తానని జట్టులో కొందరికి ముందే చెప్పానని తెలిపాడు. ‘వైభవ్ సూర్యవంశీ వికెట్ నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. మొదటి బంతికే సూర్యవంశీని ఔట్ చేస్తానని నేను జట్టులోని కొందరికి ముందే చెప్పాను. బౌన్సర్‌తో అయినా లేదా ఎలా అయినా వికెట్ పడగొడుతా అని చెప్పా. వైభవ్ వికెట్ పడడం చాలా సంతోషంగా ఉంది’ అని హింగే చెప్పాడు. హైదరాబాద్ ఫాన్స్ హింగేపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘హాట్సాఫ్ ప్రఫుల్ హింగే’, ‘చెప్పినట్టే మొదటి బంతికే బుడ్డోడి వికెట్ తీశావ్ హింగే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్‌లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..