Praful Hinge: 4 వికెట్స్ తీస్తానని ముందే రాసిపెట్టుకున్నా.. నేను మానిఫెస్టేషన్‌ను నమ్ముతా!
- అరంగేట్ర మ్యాచ్‌లోనే హింగే అద్భుత ప్రదర్శన
- నాలుగు ఓవర్ల కోటాలో 34 పరుగులకు నాలుగు వికెట్స్
- 4 వికెట్స్ తీస్తానని ముందే రాసిపెట్టుకున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విదర్భ యువ బౌలర్ ప్రఫుల్ హింగే అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన హింగే.. తన నాలుగు ఓవర్ల కోటాలో 34 పరుగులకు నాలుగు వికెట్స్ పడగొట్టాడు. అద్భుత ప్రదర్శతో ఈ విదర్భ ఎక్స్‌ప్రెస్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా హింగే తన భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ.. ఈ ప్రదర్శనను తాను ముందే ఊహించుకున్నానని చెప్పాడు. గత ఏడాదే తన డెబ్యూ మ్యాచ్‌లో నాలుగు లేదా ఐదు వికెట్లు తీస్తానని రాసిపెట్టుకున్నా అని, అదే ఇప్పుడు నిజమైందని తెలిపాడు.
ఇలాంటి డెబ్యూ ఊహించారా? అని అడగ్గా… ‘అవును, నేను ముందే ఆలోచించాను. గత సంవత్సరం ఎక్కడో నేను రాసుకున్నాను. ఎప్పుడైనా నా మొదటి మ్యాచ్ ఆడితే తప్పకుండా నాలుగు లేదా ఐదు వికెట్లు తీస్తానని రాసిపెట్టుకున్నా. పవర్‌ప్లేలో ఎంతవరకు ఆధిపత్యం చెలాయించగలనో అంతవరకు చేయాలని అనుకున్నాను. మానిఫెస్టేషన్‌ను నేను నమ్ముతా. ఇతరులు నమ్ముతారో లేదో తెలియదు కానీ.. నేను మాత్రం గట్టిగా నమ్ముతాను. అది ఈ రోజు నిజమైంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ప్రఫుల్ హింగే చెప్పాడు.
Also Read
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
‘నేను 13 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడటం ప్రారంభించాను. అప్పటికి లెదర్ బాల్ క్రికెట్ అంటే ఏమిటో కూడా నాకు తెలియదు. 13 ఏళ్ల వయసులోనే క్లబ్‌లో చేరాలని నా తండ్రిని అడిగాను. నేను చిన్నవాడినని చెప్పి నాన్న 2-3 సార్లు నిరాకరించారు. కానీ ఎలాగోలా నాన్నను ఒప్పించా. అక్కడి నుంచి నా ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆడుతూనే వచ్చాను. ఇప్పుడు ఈ స్థాయిలో నిలబడటం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డును నా కుటుంబానికి అంకితం చేస్తున్నా. ఎందుకంటే నా కోసం వారు చాలా త్యాగాలు చేశారు. నన్ను బాగా చూసుకున్నందుకు ఎంఆర్ఎఫ్‌కు ధన్యవాదాలు. ఫిజియో నవీన్ సర్ నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. నేను ఈ స్థాయికి రావడానికి వారు కూడా కారణం. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని ప్రఫుల్ హింగే తెలిపాడు.
తాజావార్తలు
-
Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
-
CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్‌తోనే పోటిపడుతున్నాం..
-
Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్‌ల ద్వారానే..
-
AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
-
The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!